లక్షలాది రూపాయల నీళ్లు తాగింది ఎవరో.?

ధర్మపురి ఆలయంలో..

( J. Surender Kumar )
                                      ( పార్ట్ 2 )

పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో లక్షలాది రూపాయల నీటిని తాగింది ఎవరో ?  అనే చర్చ భక్తజనంలో ఉంది. నీటి సరఫరా పేరిట లక్షలాది రూపాయలను ఖర్చు చేసినట్టు రికార్డుల లో నమోదు చేయడంతో ఈ చర్చకు అవకాశం ఏర్పడింది.

నీటి సరఫరా పేరిట ₹1,57,343/-


గత మూడు సంవత్సరాలుగా నీటి సరఫరా కోసం ఆలయ ఆదాయం నుంచి  ₹ 1,57,343/- ఖర్చు  చేసినట్టు సమాచారం.  2018-19 లో  ₹65,008/-  2019- 20 లో  ₹68,225/-   2020- 21 లో ₹55,155/-.  రికార్డులలో నమోదు అయినట్టు సమాచారం.

పుష్కల నీటి సౌలభ్యం!

ఆలయ ప్రాంగణంలో, అన్నదాన మండపం వెనక బోరు పంపు, ఆలయం కోసం  కొనుగోలు చేసిన  ఇంటిలో పుష్కలమైన నీటి వసతి ఉన్న బావి ఉంది…

గుడి ముందు విఠలేశ్వర స్వామి ఆలయ ఉన్న భాగంలో బోర్వెల్!

ఆలయం ముందు  (గతంలో విఠలేశ్వర స్వామి ఆలయ స్థలంలో) బోరు పంపు, శివాలయం ముందు రథలు  నిలిపి ఉన్న చోటు బోర్ పంపులు, శివాలయంలో మరోకటి.. దాతల సహకారంతో నీటి ఇబ్బందులు ఏర్పడకుండా భారీ  నీటి సంపు నిర్మాణం (రథములను నిలుపు స్థలం అడుగు భాగంలో) నీటి పర్యవేక్షణ కోసం ( తాత్కాలిక ) ప్రత్యేక ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం కు చెందిన ‘రాజు వేగ్నేష్ ఫౌండేషన్’ సంస్థవారు గత కొన్ని సంవత్సరాల క్రితమే ఆలయంలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు.

శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నీటి లభ్యత


దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శమైన మిషన్ భగీరథ పథకం అద్భుతంగా అమలులో ఉన్న మన రాష్ట్రంలో నీటి కోసం లక్షలాది రూపాయలు ఖర్చు అయినట్టు రికార్డులు నమోదు చేయడం  విశేషం.

ఉగ్ర నరసింహ స్వామి ఆలయం హోమశాల పైన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్

అలంకరణకు ₹.1,56000/-
ఎలాంటి టెండర్ ప్రక్రియ, ప్రకటన జారీ చేయకుండా కొటేషన్లు లేకుండా,  ఇష్టానుసారం జాతర ఉత్సవాలలో పువ్వుల వేదిక అలంకరణ నిమిత్తం, ఒకే సంస్థకు ఒకే రోజున  ₹1,56,000/- చెల్లించినట్లు రికార్డులు నమోదు చేశారు. 2018, ఏప్రిల్ 20న ఒకేరోజు 9 ఓచర్ల ద్వారా ₹ 1,56,000/- లైట్ హౌస్ కు చెల్లించినట్టు రికార్డులో పేర్కొన్నారు.  ఓచర్ నెంబర్ 65, ₹14,000/- వేదికను పూలతో అలంకరించుటకై. ఓచర్ నెంబర్ 66, ₹20,000/- వేదికను పూలతో అలంకరణకై, ఓచర్ నెంబర్ 67, ₹8,500/- వేదికను పూలతో అలంకరణ ఓచర్ నెంబర్ 68, ₹8,500/- వేదికను పూలతో అలంకరణకై. ఓచర్ నెంబర్ 69, ₹15,000/- వేదికను పూలతో అలంకరణ మరియు గ్రీన్ మ్యాట్, కుర్చీలు ఓచర్ నెంబర్ 70, ₹20,000/- వేదికను పూలతో అలంకరణ విఐపి కుర్చీల కోసం, ఓచర్ నెంబర్ 71, ₹ 30,000/- రథములను పూలతో అలంకరణ.. ఓచర్ నెంబర్ 72, ₹ 15,000/- వేదికను పూలతో అలంకరణకై, ఓచర్ నంబర్ 73, ₹ 25,000/- వేదికను పూలతో అలంకరణకు. ఒకే రోజున ఆరుసార్లు పూల అలంకరణ వేదికంటూ పేర్కొని,  మూడు ఓచర్లలోను వేదిక అలంకరణ, మరియు గ్రీన్ మ్యాట్, కుర్చీలు, విఐపి కుర్చీలు, రథములకు, పూల అలంకరణ అంటూ రికార్డు పుస్తకంలో నమోదు చేసిన ఘనత ఒక్క ధర్మపురి ఆలయాధికారులకే చెందుతుంది కాబోలు. ఈ  ఖర్చుల పై ప్రభుత్వం వివరణ కోరినట్లు సమాచారం.

పందిళ్లు  పేరిట ₹87,500/-.

భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, షామియాలు, ఏర్పాటు చేసిన వారికి ₹ 87,500/- చెల్లించినట్టు రికార్డులో పేర్కొన్నట్టు సమాచారం. అయితే  పందిళ్లు, జాతర ఉత్సవాల సందర్భంగా కాదు , ఆర్థిక సంవత్సరంలో అవసరమైన మేరకు భక్తులకు నీడ కల్పన కోసం వీటిని వేయించినట్టు రికార్డులో నమోదు అయినట్టు సమాచారం. ఎలాంటి టెండర్ ప్రకటన, ప్రక్రియ ,సమాచారం లేకుండానే అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారు అనే ఆరోపణలు ఉన్నాయి . ఈ ఖర్చుల తీరుతున్నలపై అధికారులకు మెమో జారీ చేసినట్లు తెలిసింది.

చిత్ర విచిత్రమైన ఖర్చులు నమోదు ₹48,101/-సున్నం రంగుల అలంకరణ పేరిట!
ఆలయంలో నిర్వహించబడే ఉత్సవాల కోసం సున్నం, రంగుల వేయుటకు .₹48,101/-  ఖర్చు  రికార్డులో నమోదు  చేసినట్టు సమాచారం.  చిత్ర విచిత్రమైన ఖర్చుల నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. ఒకే తేదీన  ( 20-4- 2018)  వొచేర్ నెంబర్ 48, ₹13,140/- బ్రహ్మోత్సవాలలో కోనేరుకు సున్నం, రంగులు వేయుటకు. ఓచర్ నెంబర్ 49, ₹5,400/-  మహాశివరాత్రి ,.శ్రీ రామలింగేశ్వర ఆలయంలో మెట్ల కు, రథంకు, రంగులు వేసినందుకు అని పేర్కొనబడింది. శివరాత్రి పండుగ తరువాత ,స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగడం అనాదిగా కొనసాగుతున్న సాంప్రదాయం. ఓచర్ నంబర్ 50, ₹7,861/- బ్రహ్మోత్సవాలలో మూడు రథములకు కలర్స్ వేయుటకై, ఓచర్ నంబర్ 100,  తేది 7-05-2018 న ₹,21,700/- పుట్ట బంగారం, స్టేజి,దేవస్థానం ముందు మెట్లకు రంగులు, తదితర వాటికి లేబర్ చార్జీలు అంటూ పేర్కొనడం పరిశీలిస్తే, బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ మొదటి వారంలోనే ముగుస్తాయి, లేబర్ ( కూలిలకు రోజు వారిగానే  చెల్లింపులు ఉంటాయి.) ఉత్సవాలు ముగిసిన దాదాపు రెండు నెలలకు లేబర్ల కు కూలి డబ్బులు చెల్లించినట్లు రికార్డులు నమోదు చేసిన ఘనత ఆలయ అధికారులకే దక్కుతుంది కాబోలు. ఈ అంశంలో ప్రభుత్వం అధికారులను సంజాషి కోరినట్టు సమాచారం.