లక్షలాది రూపాయల విద్యుత్ సామాగ్రి కొనుగోలుఅలవాటుగా  మారింది!

ఆలయ నిధులనుండి !


( J. Surender Kumar )


( పార్ట్ – 3 )


ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిధుల నుండి లక్షలాది రూపాయల తో అదనంగా విద్యుత్ సామాగ్రి కొనుగోలు కోసం ఖర్చులు రికార్డులలో నమోదు చేయడం  అధికారులకు  అలవాటుగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి.

వివరాల్లోకి వెళితే..

విద్యుత్ సామాగ్రి కొనుగోలు.₹ 5,08,976/-
గత మూడు సంవత్సరాల కాలంలో ఆలయ నిధుల నుండి ₹5, 08, 976/- విలువ గల విద్యుత్ సామాగ్రిని కొనుగోలు చేసినట్లు అధికారులు రికార్డులలో నమోదు చేసినట్లు సమాచారం.   2018-19 లో  ₹ 1,93,768/-  2019-20 లో    ₹ 1, 72, 680/-  2020-21 లో  ₹ 1,42, 528/- ఖర్చుల వివరాలు రికార్డులలో నమోదు చేశారు.

టెండర్ ముందస్తుగా  కొనుగోలు చేశారు !

ప్రతి ఆర్థిక సంవత్సరం ఆలయ నిర్వహణ కోసం టెండర్ ప్రకటన  ( ఆన్లైన్, ఆఫ్లైన్ ) ద్వారా సరుకులు ( దిట్టం ), శానిటేషన్ సామాగ్రి, విద్యుత్ ,  పూజా సామాగ్రి తదితర అంశాలు సంవత్సర కాలంకు సరిపడే విధంగా టెండర్, లేదా ఆన్లైన్  ప్రక్రియ ద్వారా కొనుగోలు చేస్తారు. అయినా ప్రతి సంవత్సరం  ఆలయ నిధుల నుండి లక్షలాది రూపాయలు డ్రా చేస్తూ, ప్రతి సంవత్సరం అదనంగా విద్యుత్ సామాగ్రి పరికరాలు కొనుగోలు చేసినట్టు రికార్డులలో నమోదు అవుతూనే ఉంటుంది.

గత సంవత్సరం జారీ చేసిన టెండర్ ప్రక్రియ ఇలా!

టెండర్ ప్రకటన RcNo.12/2021, తేదీ 02-02-2021న  ఈ ప్రోక్రుమెంట్ ( ఆన్లైన్ )  5 అంశాలు, షీల్డ్ టెండర్ ద్వారా15 అంశాలు సప్లై కోసం, ధర్మపురి ఆలయ పక్షాన, ప్రధాన పత్రికలలో ప్రకటన జారీ చేశారు. ఇందులో 12 వ అంశం ”ఎలక్ట్రికల్ సామాగ్రి సప్లై”  అని పేర్కొన్నారు. ఇందుకోసం EMD ₹ 40,000/-  షెడ్యూల్ ధర  ₹ 2000/- గా పేర్కొన్నారు.

టెండర్లుపేర్కొన్న విద్యుత్ పరికరములు

ఇందులో ట్యూబ్ లైట్లు, ఫిలిప్స్ కంపెనీ,  6, 4, 2, m.m అల్యూమినియం వైర్ బెండళ్ళు  నుకోడ .కంపెనీ, డీబీలు, స్విచ్ బోర్డులు, హైలోజన్ , ఎల్ఇడి బల్బులు తదితర వాటి సప్లై కోసం టెండర్ ప్రకటన జారీ చేశారు. బ్రాండెడ్ , కంపెనీవి కనుక వాటికి, వారంటీ, గ్యారెంటీ కూడా సదరు టెండర్ లో హక్కులు పొందిన వేలం దారుడు, ఇవ్వాల్సి ఉంటుంది.  అయినా ప్రతి ఏటా విద్యుత్ సామాగ్రి కొనుగోలు పేరిట లక్షలాది రూపాయల ఖర్చు చేసినట్టు రికార్డులలో నమోదు చేయడం విశేషం. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఆలయ అవసరాలకు అనుగుణంగా సంవత్సర కాలం పాటు,ఉపయోగపడే  వినియోగించుకోనున్న  విద్యుత్ పరికరములు వివరాలు టెండర్ లో పొందుపరిచి ఆ మేరకే వారి ద్వారా కొనుగోలు చేయడం విధానం. అయితే మధ్యలో కొనుగోలు చేసినట్టు అధికారులు రికార్డులలో నమోదు చేయడంలో ఆంతర్యమేమిటో అంతుచిక్కడం లేదు.
జనరేటర్ నిర్వహణ (డీజిల్) పేరిట ₹ 3,24,746/

దేశంలో రెప్పపాటు కరెంటు పోనీ రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు తెచ్చిన సీఎం కేసీఆర్ పాలనలో,. ఆలయంలో జనరేటర్ ( డీజిల్)  కోసం గత మూడు సంవత్సరాలు కాలంలో ₹ 3,24,746/- రూపాయలు ఖర్చు చేసినట్టు రికార్డులలో నమోదు చేశారు. 2018-19 లో ₹ 1,06,896/- 2019-20 లో  ₹ 68,225/- 2020-21 లో ₹  95,718/- గా పేర్కొనబడింది.

ఇది ఇలా ఉండగా 2015 పుష్కరాల సందర్భంగా ధర్మపురి ఆలయం నిరంతర విద్యుత్తు సరఫరా కోసం  ప్రభుత్వం సబ్ స్టేషన్ నుంచి ప్రత్యేక కేబుల్ లైన్ ను హరిత హోటల్, మంగళగడ్డ, తెలుగు కళాశాల, బ్రాహ్మణ సంఘ భవనం, మీదుగా ఆలయానికి విద్యుత్తు సరఫరా అనుసంధానం చేశారు.  అయితే ఆలయానికి నిరంతర విద్యుత్ సౌలభ్యం ఉందో ?  లేదో ?  ఆలయ  అధికారులే వివరించాల్సి ఉంటుంది.