జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ !
(J. Surender Kumar)
ధర్మపురి మండలం మగ్గిడి సాంఘీక సంక్షేమ గురుకుల హాస్టల్ ను జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంగళవారం సందర్శించి విద్యార్థులను భోజన వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .
మగ్గిడి హాస్టల్ లో విద్యార్థులకు వసతులు కల్పించలేదు. 5వ తరగతి నుండి చదువుతున్న విద్యార్థులు అదే క్లాస్ రూమ్ లో చదువుకోవాలి అందులోనే పడుకోవాల్సి వస్తుంది. అన్నారు.
పిల్లలు వాడే బాత్రూమ్ మొత్తం దుర్వాసన వస్తుంది. శాశ్వత నీటి వసతి లేదు. ట్యాంకర్ ద్వారా నీళ్లు అందిస్తే ఇక్కడి పిల్లలు స్నానాలు చెయ్యడం బాత్రూము లకు వెళ్లడం జరుగుతుంది వాళ్లకు పెట్టె బోజనాలు సైతం నాణ్యత లేదు. మాడిపోయిన అన్నం, పప్పు, పచ్చి పులుసు పెడుతున్నారు. అని ఆరోపించారు.

మంత్రి ఈశ్వర్ కు ఒకటే విన్నవిస్తున్నాం పిల్లలు రేపటి భవిష్యత్తు వారికి చదువుకోవడానికి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం.
వారికి సరైన బెంచిలు,టేబుల్స్ లేవు,కప్పుకోవడానికి బేడీషీట్లు లేవు,పడుకోవాలంటే చాపలు లేవు,తినడానికి సరైన తిండి లేదు.ఇంతటి దయనీయ పరిస్థితి మంత్రికి కనిపించడం లేదా అన్నారు.
మంత్రి ఈశ్వర్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గా ఉన్నారు అలాంటప్పుడు హాస్టళ్లు ఎలా ఉండాలి ఎలా ఉన్నాయి.
జిల్లా కలెక్టర్ గొల్లపల్లి లో హాస్టల్ ని ఎందుకని పూర్తి చెయ్యలేదు. హుటాహుటిన అక్కడి విద్యార్థులను మగ్గిడి హాస్టల్ కి తీసుకు వచ్చారు..కానీ ఇక్కడి వసతుల గురించి ఆలోచించారా?
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఈశ్వర్ విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలేని స్థితిలో ఉంటే వెంటనే పదవికి రాజీనామా చెయ్యాలి.
ఎన్నికలు దగ్గర పడుతున్నాయని శంకుస్థాపనలకు కొబ్బరికాయలు కొట్టడం, దళిత బంధు, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ చెక్కులు పంచడం, కుట్టుమిషిన్ లను పంచడం కాదు మంత్రిఈశ్వర్ గారు హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల దృష్టి పెట్టండి. అంటూ లక్ష్మణ్ కుమార్ మంత్రిని కోరారు.