మంత్రి నిరంజన్ రెడ్డికి 
ఎమ్మేల్యే డా సంజయ్ వినతి !


(J. Surender Kumar)


జగిత్యాల చల్ గల్ పండ్ల మార్కెట్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ బుధవారం హైదరాబాద్ లోవ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డిని  కలిసి వినతి పత్రం అందజేశారు.

ముఖ్యమంత్రి  వాలంతరీ ద్వారా పది ఎకరాలు కేటాయించగా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలనీ, ఇటివల  లక్ష స్క్వేర్ ఫీట్ లలో నిర్మించిన మామిడి,వ్యవసాయ మార్కెట్  లో సీసీ రోడ్లకు, కరెంటు,ఇతర మౌలిక సదుపాయాలు  సౌకర్యం నిమిత్తం నిదులు మంజూరు చేయాలని మరియు సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి కీ ఎమ్మెల్యే వివరించారు.నిధుల మంజూరుకు మంత్రి సానుకూలంగా స్పందించారనీ ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ తెలిపారు.

నివాళి అర్పించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !

జగిత్యాల లో మర్రిపల్లి దేవయ్య భౌతిక దేహానికి నివాళి  అర్పించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాళులర్పించారు
పురాణిపేట బంజరుదొడ్డి వాడలో రజక సంఘం పెద్ద మర్రిపెళ్లి దేవయ్య మరణించగా వారి భౌతిక దేహానికి నివాళులు అర్పించి. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు . ఆయన వెంట తాటిపర్తి దేవేందర్ రెడ్డి మాజీ కౌన్సిలర్స్ బడుగు పద్మరాజేందర్, రేపల్లి హరికృష్ణ  పులి రాము. తదితరులు ఉన్నారు.

₹ 10 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత!

ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన భోయిని రాజవ్వకు, బుధవారం స్టార్ హెల్త్ కంపెనీలో 10 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును హైదరాబాద్ జోన్ అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ కర్ణం చంద్రశేఖర్ అందించారు.
బోయిని రాజవ్వ భర్త సత్తయ్య గత మార్చి నెలలో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు
నామిని గా ఉన్న అతని భార్య బోయిని రాజవ్వకు. చెక్కును అందించారు.  ఈ సందర్భంగా స్టార్ హెల్త్ ADM  మాట్లాడుతూ , ప్రతి ఒక్కరు ప్రమాద బీమా ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నట్లయితే వారి కుటుంబానికి ఆర్థికంగా రక్షణగా ఉంటుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ కంపెల్లి రాము మాట్లాడుతూ అతి తక్కువ ప్రీమియం లో స్టార్ హెల్త్ పాలసీలు అందుబాటులో ఉన్నాయని,  కొత్తగా స్టార్ హెల్త్ కంపెనీ నుండి అవుట్ పేషంట్ కేర్, పాలసీ కూడా ప్రారంభం అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఏజెంట్లు భూక మహేష్, కట్ట హరీష్, తోట అఖిలేష్ పాల్గొన్నారు.