(J. Surender Kumar)
పి టి ఐ వార్త కథనం మేరకు…
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో పారామిలటరీ దళానికి చెందిన శిబిరం సమీపంలో మావోయిస్టులు మంగళవారం సాయంత్రం కాల్పులు జరపడంతో CRPF జంగల్ వార్‌ఫేర్ యూనిట్, కోబ్రాకు చెందిన ఒక కమాండో మరణించినట్లు పోలీసులు తెలిపారు.
చింతగుఫా, పోలీస్ స్టేషన్ పరిధిలోని దబ్బకొండ- పెంటపాడ్ గ్రామాల మధ్య ఈ సంఘటన మంగళవారం సాయంత్రం 4:30 నుండి 5 గంటల మధ్య జరిగింది, ఇక్కడ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ,ఇటీవల క్యాంపును ఏర్పాటు చేసింది, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ పి పిటిఐకి తెలిపారు.
కమాండో కేరళకు చెందినవాడు.
రాజధాని రాయ్‌పూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శిబిరంలో రాష్ట్ర పోలీసు జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) మరియు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) బలగాలు కూడా ఉన్నాయి.
శిబిరం సమీపంలో ఏరియా డామినేషన్, ఆపరేషన్‌పై పెట్రోలింగ్ బృందం, బయటకు వెళ్లినప్పుడు, మావోయిస్టుల బృందం కాల్పులు జరిపిందని, దీంతో ఎదురు కాల్పులు ప్రారంభమైనట్టు ఐజి వివరించినట్టు పిటిఐ వార్తా కథనం
మావోయిస్టులు వెంటనే దట్టమైన అడవిలోకి పారిపోయారని
“కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (కోబ్రా) 202వ, బెటాలియన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సులేమాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని సమీపంలోని భేజీ గ్రామంలోని సిఆర్‌పిఎఫ్ ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడు” అని సుందర్‌రాజ్ తెలిపారు. మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన వాడని ఐజి తెలిపారు. అదనపు భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని అడవులలో కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందని ఐజి తెలిపారు.