మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి కొప్పుల స్నేహాలత!

( J. Surender Kumar)

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం అంబారిపేట గ్రామంలో శనివారం ప్రైమరీ స్కూల్ వేదికగా ఎల్.ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు ప్రతిమ ఫౌండేషన్ ఆద్వర్యంలో సయుక్తంగా నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపును ఎల్.ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ శ్రీమతి కొప్పుల స్నేహలత ఈశ్వర్  ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో స్నేహలత  మాట్లాడుతూ,….
ధర్మపురి నియోజకవర్గంలోని గ్రామాల్లో చిన్నపిల్లలకు,  మహిళలకు ఆరోగ్యం, విద్య అందించాలనే సంకల్పంతో ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, గ్రామ స్థాయిలో పనిచేస్తేనే బ్రతకగలమని పనిచేసుకుంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదనే సంకల్పంతో ప్రతిమ పౌడేషన్ వారి సహకారంతో  హెల్త్ క్యాంపును నిర్వహించడం జరిగిందని అన్నారు.
ఎల్‌.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు ప్రతిమ ఆసుపత్రి ద్వారా నిర్వహించిన ఉచితం వైద్య మరియు వ్యాధి నిర్ధారణ శిబిరంనందు ఈ రోజు 1240 మంది హాజరు కాగా అందులో 427 మంది రోగులకు వైద్యులు పరీక్షించి, ఇందులో 156 మంది రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సూచించారు.