ఎమ్మెల్యే సంజయ్ ని కలిసిన వెలమ సంఘ అధ్యక్షుడు!

(J. Surender Kumar)

జగిత్యాల డాక్టర్ సంజయ్ కుమార్ ను మంగళవారం పద్మనాయక (వెలమ) సంక్షేమ మండలి అధ్యక్షుడు యాచమనేని వెంకటేశ్వర రావు ఆయన నివాసంలో కలిశారు.

గత రెండు రోజుల క్రితం వెలమ సంఘం ఎన్నికలు జరగగా వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలిసి సంక్షేమ మండలి అభివృద్ధి కోసం సహాయ సహకారాలు సలహా తదితర అంశాలపై సంప్రదించినట్టు సమాచారం. ఈ సందర్భంగాఎమ్మెల్యే నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులను, కార్యవర్గ సభ్యులను, అభినందించారు.
సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే!

శ్రీ సుబ్రమణ్యస్వామి షష్ఠి సందర్భంగా పట్టణంలోని శ్రీ సుబ్రమణ్య త్రికుటాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్వామి వారిని దర్శించుకుని స్వామి వారికి క్షీరాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను ఆలయ నిర్వాహకులు సన్మానించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ మార కైలాసం, అర్వపల్లి రాజేందర్, కమటాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.