( J.Surender Kumar)
రాయికల్ మండలం ఇటిక్యాల మోడల్ స్కూల్ ను పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శనివారం సందర్శించారు. కబ్జాకు గురైన పాఠశాల స్థలాన్ని పరిశీలించారు. మోడల్ స్కూల్ లైబ్రరీని పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలకు భూమి కాపాడేందుకు ప్రయత్నం చేస్తే తమకు నోటీసులు పంపించారని పాఠశాల ప్రిన్సిపల్ , సిబ్బంది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎదుట వాపోయారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకోవడం తోపాటు, మోడల్ స్కూల్ భూమినిసైతం ఆక్రమించుకునేందుకు యత్నిస్తు న్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సర్వే చేపట్టి ప్రభుత్వ భూమి హద్దు రాళ్ళు ఏర్పాటు చేసి, మోడల్ స్కూల్ భూమిని పరిరక్షించాలి. కోర్టు కేసులో ఉన్న 19 గుంట లు మినహా, మిగిలిన భూమిని భవిషత్ అవసరాల కోసం మోడల్ స్కూల్ కి అప్పగించాలి. ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. అనంతరం ఎమ్మార్వో ను కలిసి మోడల్ స్కూల్ భూమి సరిహద్దులు ఏర్పాటు చేసి, స్థలాన్ని పరిరక్షించాలని అన్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకున్న వారి నుండి భూమి స్వాధీనం చేసుకోవాలని ఈ మేరకు తసిల్డార్ కు జీవన్ రెడ్డి లేఖ రాశారు.