ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు !


జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ లో


( J.Surender Kumar)

14, నవంబర్ ” బాలల దినోత్సవం ” . ముందస్తుగా జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో శనివారం చిన్నారులతో క్రీడా సాంస్కృత ఉత్సవాలను పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించింది..

ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, మరియు పువ్వులు, కూరగాయలు, జంతువులు, పక్షులు , కార్టూన్, వివిధ రకాల వృత్తులు, దేవతలు మరియు స్వతంత్ర్య సమర యోధుల వేషధారణలు, నాటికలు చూపరులను మంత్ర ముగ్ధులను చేసాయి. అదే విధంగా ” నాన్న ప్రేమ” ప్రదర్శించిన నాటిక పలువురిని ఆకట్టుకుంది.

నెహ్రూ జయంతి ప్రాముఖ్యతను, పాఠశాల డైరెక్టర్ శ్రీ బియ్యల హారి చరణ్ రావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు., ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మాట్లాడుతూ భారత దేశాన్ని దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి పథంలో నడిపించిన సమర్థత జవహర్‌లాల్‌ నెహ్రూ సొంతం. స్వాతంత్ర్యం కోసం బ్రిటిషు వారితో పోరాటం చేసేటప్పుడు మహాత్మా గాంధీకి ఈయన ప్రథమ శిష్యుడిగా ఉండేవారు.

స్వాతంత్యం సంపాధించిన తరువాత భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిజేశారు. అందుకే నెహ్రూని జాతి అంతా గుర్తించి గౌరవిస్తోంది. పిల్లలను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని నెహ్రూ తరచూ చెప్పేవారు.

ఆయన పాలనాకాలంలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది. అందుకే ఆయన పుట్టిన రోజు నాడు మనదేశంలో బాలలంతా పండగ చేసుకుంటారు. అని విద్యార్థులకు ఆయన వివరించారు.


ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు శ్రీ బియ్యల హారి చరణ్ రావు, శ్రీధర్ రావు, మౌనిక రావు, సుమన్ రావు, అజిత రావు, రజిత రావు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.