( J. Surender Kumar)
సీఎం కేసీఆర్ ప్రభుత్వం మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమైనట్టు ఊహాగానాలు ఎగిసిపడుతున్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా ముందస్తు కు సమాలోచన చేస్తున్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. బహుశా ఫిబ్రవరి చివరి వారంలో క్యాబినెట్ సమావేశం ఏర్పాటుచేసి ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు చర్చ.. ముందస్తు ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ ? ప్రధాని నరేంద్ర మోడీ ? ఎవరు ముందడుగు వేస్తారో అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
డిసెంబర్ చివరి వారంలో శాసనసభ సమావేశాలు నిర్వహించనున్న కేసీఆర్ ప్రభుత్వం, అసెంబ్లీ వేదికగా ప్రధాని మోడీ ప్రభుత్వం రాష్ట్రం పట్ల వివక్ష, నిధుల మంజూరు పట్లు నిర్లక్ష్యం తదితర అంశాలు అసెంబ్లీ వేదికగా వివరించే అవకాశాలు ఉన్నట్టు చర్చ నెలకొంది. నూతన సెక్రటేరియట్ భవనం జనవరి చివరి వారం వరకు పూర్తి కానున్న నేపథ్యంలో, ఫిబ్రవరి 17 సీఎం కేసీఆర్ పుట్టినరోజు కావడం,.2014 ,ఫిబ్రవరి మాసంలోనే పార్లమెంట్ లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడం, తదితర సెంటిమెంట్ ల నేపథ్యం, అసెంబ్లీ రద్దు చేస్తే కర్ణాటక ఎన్నికల్లో తో పాటు, ఎన్నికలకు వెళ్ళవచ్చు అని బీరాస పార్టీ అంచనా.
ఇదిలా ఉండగా. శీతాకాల పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ మాసంలో ప్రారంభం కానున్నాయి. కేంద్రం ఆధీనంలో కొనసాగుతున్న స్వయం ప్రతిపత్తి గల కొన్ని విచారణ సంస్థలు (CBI లాంటి కొన్నింటికి) సవరణలు, మరికొన్ని బిల్లులు ఆమోదం, సంక్షేమ పథకాలు అమలు తీరుతున్నలు పర్యవేక్షించడం,. తదితర అంశాలు పరిగణంలోకి తీసుకొని. ఫిబ్రవరి చివరి మాసంలో కేంద్ర క్యాబినెట్లో పార్లమెంటు రద్దు, ముందస్తు ఎన్నికలకు ప్రకటన వెలబడే అవకాశం ఉందనే చర్చ. రాష్ట్రంలో బిజెపి పార్టీలోకి చేరికలు పెరగడం, కాంగ్రెస్ నాయకత్వం బలహీన పడడంతో, రామన్న ఎన్నికల్లో బిజెపితో భారత రాష్ట్ర సమితికి పొంచి ఉన్న రాజకీయ ముప్పు, జమిలి ఎన్నికల్లో పొంచి ఉన్న ఇబ్బందులు గుర్తించిన సీఎం కేసీఆర్, రాష్ట్రంలో మూడోసారి అధికారం లోకి రావాలని రాజకీయ మేధో మదనంలో ముందస్తు ఎన్నికల అంశం ఓ భాగంగా చర్చ. .
రాష్ట్రంలో, దేశంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయో? లేదో ? వేచి చూడాల్సిందే.