మునుగోడు తో బిఅర్ఎస్ జైత్ర యాత్ర షురూ !
మంత్రి కొప్పుల ఈశ్వర్ !


ధర్మపురి లో టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల సంబరాలు.


(.J. Surender Kumar )
మునుగోడు ఉప ఎన్నికల్లో ధర్మమే గెలిచిందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మునుగోడు లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ అదివారం ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.

మునుగోడు ఉప ఎన్నికల కోసం గత నెల రోజులుగా పార్టీ తరఫున శ్రమించి, టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెలుపులో భాగ‌స్వామ్యులైన‌ మునుగోడు నియోజవర్గ ప్రజలకు ముఖ్యంగా తాను ఇంచార్జ్ గా ఉన్న చండూరు మండలం బోదగిపర్తి. తాస్కానిగూడెం. శిర్ధేపల్లి గ్రామల టీఆర్ఎస్ శ్రేణులు, జగిత్యాల జిల్లా నాయ‌కులు, కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….
తెరాసను ఇరుకున పెడదామనుకున్న బీజేపీనే ఇరుకున పడిందన్నారు, అయిన మునుగోడులో ధర్మం గెలిచిందని మంత్రి అన్నారు
తెలంగాణలో న్యాయమైన ప్రభుత్వాన్ని సీఎం కెసిఆర్ అందిస్తున్నారని, ప్రజల గుండెల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయన్నారు
ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రలోభాలకు మునుగోడు ప్రజలు నమ్మలేదు అన్నారు..

చండూరు మండలంలో బీఆర్ఎస్ కి భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు! ఇది ప్రజాస్వామ్య విజయం! మునుగోడు ప్రజల విజయమని మంత్రి అన్నారు
బిజెపైకి మునుగోడు ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని అన్నారు. టీఆర్ఎస్ ను ఇరుకున పెడదామనుకున్న బీజేపీనే ఇరుకునపడింది అన్నారు . ప్రజలతో ఆటలాడుకున్న ఎవరు ముందుకుపడలేదని, తెలంగాణలో న్యాయమైన ప్రభుత్వాన్ని సీఎం కెసిఆర్ అందిస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.