ధీరత్వానికి ఆమె ప్రతీక !
(J.Surender Kumar)
బ్రిటీష్ వారు భారత దేశాన్ని ఆక్రమించుకోవడానికి అనేక ఎత్తుగడలు వేశారు. ఇందులో సైన్య సహకార పద్ధతి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం వంటి విధానాలు అవలంభిచారు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా పలువురు భారతీయ రాజులు తమ రాజ్యాలు కోల్పోయారు. అటువంటి వారిలో లక్ష్మీ బాయి ఒకరు.
ఈ విషయంలో ఆమె బ్రిటిష్ వారినిఎదిరించింది. యుద్ధ యోధురాలిగా దుష్ట దౌర్జన్య, దురాగత, ఆంగ్లేయుల పాలనకు చరమగీతం పాడిన వీర నారీమణిగా పేరు పొందింది.
1828 నవంబరు 19న మహారాష్ట్రలోని వారణాసి పట్టణంలోని సతరాలో మోరోసంత్‌తాంబె, భగీరథీబాయి ఆదర్శదంపతులు ఇంట భారతమాత ముద్దుబిడ్డగా జన్మించింది..ఆమె అసలుపేరు మణికర్ణిక. తండ్రి ప్రేమగా మను అని పిలిచుకొనేవారు. మణికర్ణిక 4సం.వయస్సులో తల్లి చనిపోయింది. ఇలాంటి కష్ట సమయంలో వీరి దూరపు బంధువు వీరిద్దరికి ఆశ్రమమిచ్చి ఆదుకున్నారు.
చిన్నతనం నుంచి రకరకాల విద్యలమీద ఆశక్తి కనబరిచేది. దాంతో తండ్రి కత్తి సాము, గుర్రపుస్వారి, తుపాకి పేల్చడం లాంటి విద్యలన్నింటిని నేర్పించాడు.
ఆమెకు 13 ఏళ్లకే ఝూన్సీ పట్టణానికి చెందిన, గంగధరరావు నెవల్కశతో 1842లో వివాహం జరిగింది. తరువాత ఝాన్సీలక్ష్మిబాయిగా మారిపోయింది.
వీరికి కుమారుడు పుట్టి చనిపోవడంతో దామోదరరావును దత్తత తీసుకున్నారు.
కొద్దిరోజులకే గంగాధరరావు చనిపోయారు.
దీంతో లక్ష్మిబాయి బాధల్ని దిగమింగు కొని విలువిద్యాల్లో మరింత ప్రావీణ్యం సంపాదించి ఆ విద్యాలన్ని తన సన్నిహితులకు నేర్పించి పటిష్టమైన స్త్రీ, పురుష దళల్ని తయారు చేసింది.
కొడుకు రాజవ్వాలని కోర్టులో దావావేసింది.
కాని కోర్టు కేసుకొట్టివేసింది. లక్ష్మి బాయి కోర్టుకు వెళ్లిందనే కక్షతో బ్రిటిష్‌వారు ఆమె ఆస్తులన్నీ స్వాధీన పరచుకున్నారు. అంతే కాకుండా ఆమెను ఝాన్సీ విడిచివెళ్లమని ఆదేశాలు జారీచేశారు.
ఆమె తన ప్రజలకోసం భారతభూమి కోసం బ్రిటీష్ వారి సుంకలాల నుంచి భారతమాతను రక్షించడం కోసం ఝాన్సీని విడిచివెళ్లేదీలేదని వారితో యుద్ధా నికి సిద్ధపడింది.
ఆమె తన బలగాలను చుట్టు ఏర్పచుకొని బిట్రిష్‌వారితో చాలా భయంకరంగా యుద్ధం చేసింది. కానీబ్రిటిష్ వారు కోటగడలను బద్దలుకొట్టి నగరాన్ని చేజిక్కించుకున్నారు.
కాని రాణి ఝాన్సీ దత్తపుత్రుణ్ణి వీపునకు కట్టుకొని గుర్రపుస్వారీ చేస్తూ గ్వాలియర్ చేరుకొని అక్కడ అపార చండిలా, గ్వాలియర్ మహారాజుతో యుద్ధం చేసి గ్వాలియర్‌ను స్వాధీనం చేసుకొంది..ఈ సంతోషంలో వుండగానే మళ్లీ బ్రిటీష్ సేలు వచ్చి గ్వాలియర్‌ను ముట్టడించారు. 1858 జూన్ 17న ఆమె యుద్ధంలో వీరమరణం పొందింది..దీనిని చరిత్రలో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంగా పిలుస్తారు. యుద్ధంలో ఝాన్సీ లక్ష్మీ బాయికి ఝుల్కారి బాయి అనే బహుజన వీరవనిత సహాయపడిందని తర్వాత చరిత్రకారులు గుర్తించారు .వీరు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన పోరాటం తర్వాతి తరాలకు స్ఫూర్తిగా నిలిచింది.
(యం.రాం ప్రదీప్. గారి సౌజన్యంతో )
తిరువూరు
9492712836