(J. Surender Kumar)
జగిత్యాల్ జిల్లా కేంద్రంలో నిర్మితమైన నూతన కలెక్టరేట్ భవన సముదాయాలను కలెక్టర్ జి రవి మంగళవారం పరిశీలించారు. త్వరలోనే సీఎం కేసీఆర్ నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టర్ భవన సముదాయాన్ని నిశితంగా పరిశీలించారు.

విశాలమైన ప్రాంగణంతో కూడిన కలెక్టరేట్ ఆవరణంతో పాటు, కార్యాలయాల్లోని వివిధ విభాగాలను పరిశీలించి సంబందిత అధి కారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన దృష్ట్యా తుది పరిశీలన జరుపుతూ ప్రతి విభాగం, ప్రతి గదిని వినియోగంలోకి వ చ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అంగులాన్ని శుభ్రం చేయించాలని నీటి వసతి, టాయిలెట్స్, విద్యుత్ వ్యవస్థ, లైటింగ్ పూర్తిస్థాయిలో సక్రమంగా ఉండేలా చూడాలన్నారు.

ప్రారంభోత్సవానికి ముందే నూతన కలెక్టరేట్ భవనం కు అన్ని హం గులు, సదుపాయాలతో అందంగా ముస్తాబు చేయాలన్నారు. పరిసరాలన్ని పచ్చదనంతో ఆహ్లాదంగా ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. ప్రారంభోత్సవం రోజు నుంచే ఆయా శాఖల కార్యకలపాలన్ని నూతన కలెక్టరేట్ భవన వేదికగానే జరుగుతాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి లో టుపాట్లు లేకుండా అన్ని వసతులు అందుబాటులోకి వచ్చేలా

యుద్దప్రాతిపదికన పనులను పూర్తిచేయించాలన్నారు.
పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ లు మందా మకరంద్, బి ఎస్ లత, ఆర్డీఓ మాధురి, పలువురు జిల్లా అధికారులు ఉన్నారు.
గొల్లపల్లి లో అదనపు కలెక్టర్ మకరంద తనిఖీలు

గొల్లపల్లి మండలంలో మంగళవారం అదనపు కలెక్టర్ తనిఖీలు చేశారు.
ఇబ్రహీంనగర్ లో కాలినడకన రోడ్డుకు ఇరువైపులా నాటిన ప్లాంటేషన్ ను పరిశీలించారు. ఇబ్రహీంనగర్. రాఘవపట్నం. గొల్లపల్లి. తిర్మలాపూర్ PD గ్రామంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పల్లె పకృతివనం, వైకుంఠధామం, నర్సరీలు పరిశీలించారు. క్రీడా ప్రాంగణాలు పనులు పూర్తి చేయాలని అధికారుల ఆదేశించారు.

క్రీడలకు సంబంధించి వస్తువులు తెపించి క్రీడా ప్రాంగణాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు లేని చోట మొక్కలు నాటాలని వాటర్ రోజు పట్టాలని ,వైకుంఠ దావంలో బాత్రూంస్ పరుశుబ్రాంగా ఉంచాలని వాటర్ ప్రాబ్లమ్ లేకుండా చూసుకోవాలని వైకుంఠ దావంలో నాటిన మొక్కలు పరిరక్షించాలని గ్రామ అధికారులను ఆదేశించారు.