( J .Surender Kumar )
ఈనెల 16న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్ నూతన కమీషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జిపిఎం అండ్ ఎఆర్) ప్రవీణ్ కుమార్ తెలిపారు.
నవంబర్16 న బుధవారం మధ్యాహ్నం 3గం.లకు అమరావతి, సచివాలయం మొదటి బ్లాకు, సియం సమావేశ మందిరంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య సమాచార కమీషనర్ గా నియమితులైన ఆర్.మహబూబ్ భాషా, మరియు రాష్ట్ర సమాచార కమీషనర్ గా నియమితులైన పి.శామ్యూల్ జొనాతన్ లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారని ఆయన తెలిపారు.

.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్ కు, ముఖ్య సమాచార కమీషనర్ గా మహబూబ్ భాషా,.సమాచార కమీషనర్ గా శామ్యూల్ జొనాతన్ లను, నియమిస్తూ గత నెల 21న రాష్ట్ర ప్రభుత్వం జి ఓఎంఎస్.ల సంఖ్య 128,.129ల ద్వారా ఆదేశాలు జారీ చేసిందని ఆ ఆదేశాలకు అనుగుణంగా ఈ ఇరువురు నూతన కమీషనర్లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారని ప్రవీణ్ కుమార్ తెలిపారు.