(J.Surender Kumar)
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం పర్యటించిన సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్ధి బాట పడుతున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి పర్యటించారు. సాయన్నపేట గ్రామంలో 16 లక్షలతో నిర్మించే నూతన పాఠశాల భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో దాదాపు కోటి 63 లక్షల వ్యయంతో సిసి రోడ్లు, సంఘ భవనాల పనులకు మంత్రి ప్రారంభించి, శంకుస్థాపన చేశారు.
అనంతరం బొట్లవనపర్తి గ్రామంలో మంత్రి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పొందిన 52 మంది లబ్ధిదారులకు ఉచిత కుట్టు మిషన్లు, సర్టిఫికెట్ లను పంపిణీ అనంతరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో 40 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
మంత్రి మాట్లాడుతూ దేశానికి ఆదర్శవంతంగా సంక్షేమ పాలన సీఎం కేసీఆర్ అందిస్తున్నారని తెలిపారు. ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, కెసిఆర్ కిట్, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి తెలిపారు.

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేశామని, సీఎం కేసీఆర్ ప్రణాళిక ప్రకారం గ్రామాల్లో పచ్చదనం పారిశుధ్యం పెంపొందించామని, గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేశామని మంత్రి తెలిపారు.
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలు వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్యాస్ సిలిండర్ ధరలను, పెట్రోల్, డీజిల్ పై కేంద్ర పన్నులు గణనీయంగా పెంచడం, ఆహార పదార్థాలు, పాలు పై జీఎస్టీ విధించడం వల్ల ప్రజలు అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నారని, ప్రజలు కొనుగోలు శక్తి తగ్గిపోతుందని, కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని మంత్రి సూచించారు.