సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ
( J. Surender Kumar )
.
ఒకే పాఠశాలలో పనిచేస్తున్న సమాన స్థాయి హోదా కలిగిన ఉపాధ్యాయులు పండితులు,పి.ఈ. టి ల పై వివక్షత ఇంకెన్నాళ్లు అని ? రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ ప్రశ్నించారు
మంగళవారం మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మ్యాన పవన్ కుమార్, దర్శన్ గౌడ్, సాహితీ కార్యదర్శి రోషన్, రాష్ట్ర కార్యదర్శి చంద్రకాంత్. అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ,
కేవలం ఓటు బ్యాంకు గాని చూశారేగాని వారి సమస్యకు పరిష్కారం చిత్తశుద్ధితో పరిష్కరించలేకపోయారు అని వాపోయారు. ఎన్నికల ముందు కుడి చేత్తో జీవో తెప్పించి ఎన్నికల తర్వాత ఎడమచేత్తో లాగేసుకున్నారన్నారు అని ఆరోపించాడు. ఈ సమస్య ను ఎన్నికల హామీ కొరకే తప్ప పరిష్కారం కొరకు ప్రయత్నం చేయలేదు అన్నారు. ఇప్పటివరకు సిపిఎస్ సంఘము ఏర్పడిన ఆరు సంవత్సరాల్లోనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు సాధించిన గ్రాట్యుటీ వల్ల రిటైర్మెంట్ అయినప్పుడు ₹16 లక్షలు , ఫ్యామిలీ పెన్షన్ వల్ల సీపీయస్ ఉపాద్యాయుల కు సర్వీస్ లో భద్రత చేకూరిందన్నారు. ఇవి సాధించిన ఘనత సీపీయస్ సంఘనీదే అన్నారు.
ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర శాఖ ఎం ఎల్ సి అభ్యర్థి పోటీ లో నిల్చోపెడుతుంది అన్నారు. ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ అభ్యర్ధి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మద్ధతు తెలపాలని కోరారు. సీపీయస్ రద్దు,.మాడల్ స్కూల్ 010 పద్దు ద్వారా జీతం, 317 పరిష్కారం ,.రెసిడెన్షియల్ పాఠశాలలో , కస్తూరి భాపాఠశాల లలో సమస్యల పరిష్కరం, పదోన్నతులు, బదిలీలవంటి సమస్యలను పరిష్కరిస్తుందన్నారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర సహాయ కార్యదర్శి కృష్ణ ప్రసాద్, జిల్లా అధ్యక్షులు బీరం అమరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మి నర్సింహా రావు, జిల్లా కోశాధికారి శ్రీనివాసులు మరియు రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీయస్ డి.ఏ బకాయిలు విడుదల చేయాలని వినతి

తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్ శ్రీరామచంద్రమూర్తి ని కలిసి
సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన డి ఏ బకాయిలను చెల్లించాలని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు, కోటకొండ పవన్ , కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ, జనవరిలో జీవో నెంబర్ 3 ,తేదీ 19.01.2022 ద్వారా సిపిఎస్ ఉద్యోగులకు రావలసిన బకాయిలను మూడు విడుతల్లో చెల్లించాలని ప్రభుత్వం నాడు జీవో నెంబర్, 3 విడుదల చేసిందని ఇప్పటివరకు సిపిఎస్ ఉద్యోగు ఉపాధ్యాయులకు రావలసిన మూడు విడతల్లో రావలసిన డిఏ బకాయిలు ఎలాంటి చెల్లింపు జరగలేదన్నారు. ఈ సమస్య డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వీలైనంత త్వరగా డి ఎ పెండింగ్ బకాయిలను చెల్లింపు జరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ప్రభుత తీసుకెళ్ళి త్వరలో చెల్లింపు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్టు వారు ప్రకటనలో వివరించారు.
ఉపాధ్యాయ సంఘం నేతలను అభినందించిన డీఈవో!

తపస్ ఉపాధ్యాయ సంఘం నూతనంగా ఏర్పడిన జగిత్యాల జిల్లా శాఖను జిల్లా విద్యాధికారి బి. జగన్మోహన్ రెడ్డి అభినందించారు..,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ విద్యాభివృద్ధికి సహకారాలు అందించాలని పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు.. పాఠశాలలను అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు.. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య, బోయినపల్లి ప్రసాద్ రావులు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు.. ఉపాధ్యాయ విద్యార్థుల సంక్షేమానికి పాటుపడతామని తెలిపారు
