పానీపూరి తిన్నా, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!

(J.Surender Kumar)

ఏడు పదులు దాటిన వయస్సు, పలుమార్లు మ్మెల్యేగా,  మంత్రిగా, ఎమ్మెల్సీగా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంగళవారం తన ఇంటిలో పానీ పూరి తినడంతో, ఔరా అంటూ అనుచర వర్గం, కాంగ్రెస్ శ్రేణులు జీవన్ రెడ్డి, జివ్వుచాపల్యం  గూర్చి  పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

ప్రతిరోజూ బిజీ బిజీ గా గడిపే  జీవన్ రెడ్డి  సాయంత్రం పూట సరదాగా తన నివాసంలో తనకిష్టమైన పానిపూరి నీ సునీల్ అనే అభిమాని తీసుకువచ్చి జీవన్ రెడ్డికి  టేబుల్ ముందు పెట్టి, సార్ నా కోసం తినండి , మీరు తింటుండగా మీతో ఫోటో దిగుతానంటూ కోరాడు. అభిమాని కోరికను కాదనలేక జీవన్ రెడ్డి పానీ పూరి తింటు ఫోటోలకు ఫోజు ఇచ్చడు. ఇది  పానీ పూరి  ఉదంతం.

సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే!

జగిత్యాల పట్టణంలోని పట్టణం లోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో స్వామి వారి జన్మదినము మంగళవారం సుబ్రమణ్య షష్టి పురస్కరించుకొని స్వామి వారికి భక్తుల క్షీరాభిషేకం, ప్రత్యేక విశేష పూజలు అర్చకులు నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని
పట్టణ ప్రజలే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు, పట్టభద్రుల  ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులు  టి.జీవన్ రెడ్డి, 

జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్,  మాజీ పురపాలక సంఘ అధ్యక్షులు గిరి నాగ భూషణం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి లు, తదితరులు పెద్ద ఎత్తున  పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు..