ఆపి, రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యం లో!
శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మెల్యే సంజయ్ ..
(J.Surender Kumar)
జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 26 మంది కి ఉచిత కంటి శస్త్ర చికిత్సలను ఎమ్మెల్యే డా. సంజయ్ చేశారు.
కార్యక్రమంలో పాల్గొని రోగులకు ఉచిత మందులు, కంటి అద్దాలు ఎమ్మెల్సీ ఎల్. రమణ అందచేశారు.
ఈ సందర్భంగా .ఎమ్మేల్యే మాట్లాడుతూ 30 సంవత్సరాల
నుండి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేయటం జరిగిందని, అన్ని వర్గాల సహకారం తో ఇప్పటి వరకు పదివేల కు పైన కంటి శస్త్ర చికిత్స లు చేయటం జరిగింది అని అన్నారు..జగిత్యాల జిల్లా కు మెడికల్ కాలేజీ, మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. 100 పైగా ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నారు అని అన్నారు. .4గురు కంటి వైద్యులు సైతం అందుబాటులో ఉన్నారని, ప్రజలు వారి సేవలు ఉపయోగించుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య ,వైద్యం పై, ప్రత్యేక దృష్టి సారించింది అని ప్రజలకు మెరుగైన విద్య, వైద్య కోసం కృషి చేస్తున్నారని అన్నారు.
ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ, ” సర్వెంద్రి యానాం నయనం ప్రదానం ” అని అన్నారు. ఎమ్మేల్యే సంజయ్ ఇప్పటికీ వేల మందికి ఉచిత శస్త్ర చికిత్స లు చేయటం అభినంద నీయం అని అన్నారు ..కన్ను చాలా సున్నితమైనది అని అన్నారు .
శస్త్ర చికిత్స తరవాత జాగ్రత్తలు పాటించడం ద్వారా మెరుగైన చూపు పొందే అవకాశం ఉందని వైద్యులు చెప్పిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు

…ప్రపంచం లో ఎక్కువ మంది అందులు, చూపు సమస్య ఉన్న వాళ్ళు మన దేశంలో అధికంగా ఉన్నారని అన్నారు, ముఖ్యమంత్రి కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అందరికీ ఉచిత చికిత్సలు నిర్వహించారు అని అన్నారు …నేడు మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావడానికి కృషి చేసిన ఎమ్మేల్యే కు అభినందనలు అని అన్నారు..
ఈ కార్యక్రమంలో నాయకులు గట్టు సతీష్, భోగ ప్రవీణ్,
రాజేందర్ రెడ్డి, నరసింహ రెడ్డి,.అల్లే గంగ సాగర్, క్వాదాసు నవీన్, ఓల్లెం మల్లేశం, నరేందర్ రావు, శ్రీరామ్ బిక్షపతి, విక్రమ్,.దులురి వంశీ,.డా.విజయ్,ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.