జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత.,!
ప్రగతిభవన్ నుండి 8 మెడికల్ కాలేజీలు
ప్రారంభించిన సీఎం కేసీఆర్!
( J. Surender Kumar)
జగిత్యాల పట్టణంలోని మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఆన్లైన్ ద్వారా ప్రారంభించి, విద్యార్థులు ఉద్దేశించి సందేశం ఇచ్చారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ రవి తరపు ప్రజాప్రతినిధులు అధికారులు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రారంభోత్సవాన్ని తిలకించడంతోపాటు సీఎం ప్రసంగాన్ని ఆలకించారు.

ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ వైద్య విద్యార్థుల ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె మాటల్లో…

ఆరున్నర దశాబ్దాల్లో ఆరోగ్య రంగంలో సాధ్యం కాని ఎన్నో రికార్డులను తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో సాధించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు, పాలనలో ఆరోగ్య తెలంగాణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది అని అన్నారు.

ఒకవైపు వైద్య విద్య, మరోవైపు నాణ్యమైన వైద్యాన్ని రాష్ట్ర ప్రజలకు చేరువ చేస్తుందని అన్నారు.
జగిత్యాలని జిల్లాగా చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, ఈ రోజు జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీని ప్రారంభిచి

జగిత్యాల ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేర్చిన సీఎం కేసీఆర్ కి జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జగిత్యాల మెడికల్ కాలేజీలో పాల్గొన్న కలెక్టర్ రవి నాయక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్ర శేకర్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి ప్రవీణ్ అడిషనల్ కలెక్టర్ లత జెడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు

మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ R&B EE శ్రీనివాస్ ,మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శివ ప్రసాద్ వైస్ ప్రిన్సిపల్ డేవిడ్ ,ప్రొఫెసర్లు విద్యార్థులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
