( J. Surender Kumar )
జగిత్యాల జిల్లా పొలాస లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయంలో గురువారం ఉత్తర తెలంగాణ మండలాల కిసాన్ మేళా- 2022 కార్యక్రమం జరిగింది.

రైతులు రైతు ప్రతినిధులు భాగంగా వ్యవసాయ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ లని పరిశీలించి,.శాస్ర వేత్తలు వివిధ పంటలపై తెగుళ్ల, నివారణ, సంబందించిన వివరాల కర పత్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, ఆవిష్కరించారు.

జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ,జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బందు సమితి అధ్యక్షులు, చీటీ వెంకట్ రావు,.AMC ఛైర్మెన్ నక్కల రాధ రవీందర్ రెడ్డి,
జిల్లా వ్యవసాయ అధికారి సురేష్,.హార్టికల్చర్ అధికారి ప్రతాప్, పోలాస ADR శ్రీనివాస్, పాక్స్ ఛైర్మెన్ లు,.రైతు బందు జిల్లా,.మండల,.గ్రామ కన్వీనర్ లు,.అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

జగిత్యాల మండల పొలాస గ్రామానికి చెందిన బాలింత మహిళ కొండ్ర రమ్య ఇటీవల మరణించగా వారి
,కుటుంబ సభ్యులను . ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరామర్శించి, అధైర్య పడవద్దని అండగా ఉంటామని ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట మండల, ,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.