ప్రభుత్వ ఆసుపత్రుల పై ప్రజలకు నమ్మకం కలిగించాలి!

జిల్లా కలెక్టర్ జి.రవి

(J. Surender Kumar)

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందే వైద్య సేవలపై ప్రజలకు మరింత నమ్మకం పెంచాలని జిల్లా కలెక్టర్ జి రవి తెలిపారు.
జగిత్యాల పట్టణంలోని MCH జిల్లా కలెక్టర్ జి రవి అధ్యక్షతన జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘ సమావేశం శనివారం జరిగింది. , ఈసందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్‌ కాలేజీ అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ఆసుపత్రి 2022 సంవత్సరంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి గా, వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రి గా మారినందున జిల్లా ప్రజలకు ఆరోగ్య సేవల విస్తృతి పెరిగిందన్నారు. ఒపి ప్రతి రోజూ 400 నుంచి 800 కు పెరిగిందన్నారు. ప్రతి నెల 1000 మంది కి పైగా ఇన్ పేషంట్ గా అడ్మిట్ అవుతున్నారని , 460 కి పైగా డెలివరీ లు అవుతున్నాయని అన్నారు. డ్రగ్ స్టోర్ తో పాటు సిటీ స్కాన్ సౌకర్యం సమకూరిందని చెప్పారు. 50 పడకల అత్యవసర బ్లాక్, రేడియాలజీ డిపార్ట్మెంట్ లు వచ్చాయని అన్నారు.


ఆసుపత్రిగా రూపాంతరం చెందాక ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో క్యాంటీన్, పేషెంట్స్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. రేడియాలజీ డిపార్ట్మెంట్ , ENT డిపార్ట్మెంట్లో వైద్యుల కొరత ఉన్న దృష్ట్యా, తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి అవసరమైన వైద్యులను డిప్యూటేషన్ పై తెచ్చుకోవాలని సమావేశంలో నిర్ణయించారు

. MCH లోని ఆపరేషన్ థియేటర్ కు ఆక్సిజన్ , పైప్ లైన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆప్తాలమాలజి డిపార్ట్మెంట్లో ఆపరేషన్ థియేటర్ లేదని దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు., ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జి రవి స్పష్టం చేశారు.
జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ మాట్లడుతూ….
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ఆసుపత్రికి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.