కమిషన్ల కోసం కాలువలు తవ్వుతున్నారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాటల తూటాలు !
(J.SURENDER KUMAR)
ధర్మపురి లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన రైతు నిరసన దీక్ష లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రభుత్వం తీరును విమర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కెసిఆర్ ప్రభుత్వం పై మాటల తూటాలు పేల్చారు .
ఆయన మాటల్లో…
ప్రభుత్వానికి రైతుబందు జిందా తిలిస్మత్ అయింది..
రెండు పంటలు పండే పొలాలు అవసరం లేకున్నా కమిషన్ల కోసం కాలువలు తవ్వుతున్నారు
భు సమస్యల పరిష్కారం కోసం జిల్లాకో రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి.
24గంటలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పై విద్యుత్ సరఫరా చేస్తే మంత్రి ఈశ్వర్ కు పాలాభిషేకం చేస్తాను..
24 గంటల విద్యుత్ సరఫరా పై శ్వేత పత్రం ప్రకటించాలి..
ఉమ్మడి జిల్లా లో ఎక్కడైనా ఒక్క ఎకరానికి కాళేశ్వరం నీరు ఇచ్ఛరా.?
తెలంగాణ వస్తే మరిత మెరుగైన పాలన ఆశిస్తే నిరాశే మిగిలింది..
రైతు ఆర్థికంగా కుంగిపోవడం..పాదయాత్ర లో రైతుల కష్టాలు కళ్లారా చూసి.. వై ఎస్ ఆర్ రైతుల కష్టాలు తీర్చారు., వై ఎస్ ఆర్ ఉచిత విద్యుత్ పై మొదటి సంతకం చేశారు., రైతు బకాయిలు రద్దు చేశారు.
ఉచిత విద్యుత్ రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపింది.
2006 లో ధాన్యం కొనుగోలు సంఘాల బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించారు.
మద్దతు ధర కల్పించడంతో పాటు.. కల్లం కాడా వడ్లు కొనుగోలు చేయడం ప్రారంభించారు.
ఆనాడు తప్పా లేదు..తాలు లేదు..ఆంక్షలు లేకుండా. కోతలు లేకుండా కాంగ్రెస్ వడ్లు కొనుగోలు చేసిందని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.
ధాన్యం నాణ్యతను అధికారి ధృవీకరించిన తర్వాత కోత విదించడం ఏమిటి..
క్వింటాల్ కు రైతును రు.150 దోపిడీ జరుగుతోంది.
కాంగ్రెస్ పాలనలో వరిదాన్యానికే పరిమితం కాకుండా. పప్పు దినుసులకు అదనంగా రూ.200 మద్దతు ఇచ్చారు.
రుణ మాఫీ రు.35 వేలకు మాత్రమే అమలైంది.
నాలుగేళ్లుగా రుణ మాఫీ చేయకపోవడంతో వడ్డీకే పోతుంది.. రుణ మాఫీ కాదు.. రైతు బంధు వడ్డీ మాఫీ పథకంగా మారింది.
తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు గడుస్తున్నాయి. పంట నష్టపోతే ఒక్క రైతుకు పరిహారం ఇచిన పాపాన పోలేదు., మంత్రి ఈశ్వర్ బాధ్యత వహించాలి..
రోల్ల వాగు ప్రాజెక్ట్ కు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాన్న ముందే అనుమతి వచ్చినా నేటికీ. పూర్తి కాలేదు..
సాంకేతిక లోపంతో కట్ట తెగిపోయి కోట్లాది విలువైన మత్స్య సంపద కొట్టుకుపోయింది ..
జగిత్యాల జిల్లాలో రైతులు వర్షాలతో 10వేల ఎకరాల పంట నష్టపోయారు.
రైతులను ఏవిధంగా ఆదూ కున్నారో మంత్రి ఈశ్వర్ సమాధానం చెప్పాలి.
రొల్ల వాగు డిసెంబర్ లో పూర్తి చేయకపోతే క్రాప్ హాలిడే ప్రకటించి పరిహారం ఇవ్వాలి..
మిషన్ భగీరథ కన్న ముందు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందేది.
ధరణీతో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల భూములు కానరాకుండా పోతున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి తో కలిగే ఇక్కట్లు తొలగిస్తాం.
మేము ఏనాడైనా కక్ష్య సాధింపు చర్య లు చేశామా..
పదవి ఎవరికి శాశ్వతం కాదు..
రాబోయే కాలం లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన ఘనత సోనియా గాంధీ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన న్యాయవాదులు!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ధరణి పోర్టల్ రద్దు
కౌలు రైతుకు రైతుభీమా చెల్లించాలి
రైతు ఋణమాఫీ అమలు చేయాలి
వరిధాన్యం కొనుగోలులో దళారుల చేతివాటం
పలు సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ
ధర్మపురి మండల కేంద్రంలో రైతుల పక్షాన ఒక్క రోజు రైతు నిరసన దీక్షా కు న్యాయవాదులు గూడ జితేందర్ రెడ్డి, అలుక వినోద్, జాజాల రమేష్, సంఘీభావం తెలిపారు