లండన్ లో…
(J. Surender Kumar)
భారత సంతతి బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ కూతురు అనుష్క శుక్రవారం లండన్ నగరంలో పలువురు చిన్నారులతో కలిసి ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది .

రాగ – ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్ – 2022 లో భాగంగా ఈ నృత్య రూప ప్రదర్శన యునైటెడ్ కింగ్డమ్ లో అతిపెద్ద ఈవెంట్.
4 సంవత్సరాలు మొదలుకొని 85 సంవత్సరాల మధ్య వయస్సు గల 100 మంది కళాకారులు, ప్రత్యక్ష సంగీతకారులు, వృద్ధ సమకాలీన ,నృత్య కళాకారులు (65 సంవత్సరాల పైబడిన వారి ప్రదర్శన బృందం) దివ్యాంగులు (అంగ వైకల్యాలు ఉన్న వారు) వీల్‌చైర్ డ్యాన్సర్లు పోలాండ్‌లోని నటరాంగ్ గ్రూప్‌కు చెందిన అంతర్జాతీయ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. .
ఈ డ్యాన్స్ ఈవెంట్‌కు ప్రధాని రిషి సునక్ తల్లిదండ్రులతో పాటు, ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, కుమార్తె అనౌష్క తల్లి అక్షతా మూర్తి పాల్గొన్నారు.