ప్రజావాణిలో  సమస్యలను పరిష్కరించాలి !

   (J.Surender Kumar)     

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే  పరిష్కారం చూపాలని  జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు.

సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఐ ఎం ఏ హాల్లో నిర్వహించిన ప్రజావాణి  కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన  19 మంది ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్లు బి.ఎస్. లతా.   మకరంద్ తో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు.  ప్రజల నుండి  అందిన  దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను  ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ లో  ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి  పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.