రాజిమార్గమే రాజమార్గం !


జడ్జి శ్యాం ప్రసాద్
ఈ నెల 12 న లోకదాలత్


( J. Surender Kumar )
ఈ నెల 12 వ తేదీన లోకదాలత్ నిర్వహిస్తున్నట్లు ధర్మపురి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శ్యాం ప్రసాద్ తెలిపారు.


లోకదాలత్ లో రాజీ చేయదగిన క్రిమినల్ కేసులు మరియు సివిల్ కేసులు పరిష్కారం అయ్యేందుకు ధర్మపురి కోర్టు హాలులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి రాజేష్ , న్యాయవాదులు మరియు సంబంధిత .పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీ చేయదగిన క్రిమినల్ కేసుల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి రాజేష్ మాట్లాడుతూ, లోకదాలత్ కేసులలో, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వివరించారు. ప్రశాంతమైన వాతావరణంలో కక్షిదారులు కేసులలో రాజీపడి, సోదరభావాన్ని, పెంపొందించలని కోరారు.
ఈ సమావేశంలో
న్యాయవాదులు దుమ్మెన శ్రీనివాస్, రౌతు రాజేష్, బందెల రమేష్, రామడుగు రాజేష్, జాజాల రమేష్
ధర్మపురి ఎస్ఐ కిరణ్, వెల్గటూర్ ఎస్ఐ నరేష్, బుగ్గరాం ఎస్ఐ అశోక్ , కోర్ట్ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు