జడ్జి నిహారిక!
జగిత్యాల మహిళా కళాశాలలో..
( J. Surender Kumar)
భారత రాజ్యాంగం పౌరులందరికీ సమానమైన హక్కులతో పాటు అధికారాలు కల్పించిందని మహిళలు చట్టాలను వినియోగించుకోవడంలో అవగాహన కల్పించుకోవడంలో ముందుండాలని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జగిత్యాల జూనియర్ సివిల్ జడ్జ్ జె. నిహారిక వివరించారు.
భారత సంవిధాన దినోత్సవం లో వరకట్న నిషేధ , ప్రాముఖ్యత గురించి చట్టాల గురించి, మహిళలు అవగాహన కల్పించుకోవాలని విద్యార్థులు చదువులో ముందుండాలని ప్రతి సమస్యకు పరిష్కారం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని, ప్రతి మహిళ ఆ విధంగా నడుచుకోవాలని పేర్కొన్నారు.

స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ఎల్ ఎన్ఎస్ఎస్ జగిత్యాల జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ పడాల తిరుపతి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కే కిరణ్మయి ఆధ్వర్యంలో లీగల్ సెల్ జగిత్యాల సహకారంతో ఘనంగా భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.,
. మొదట ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థులు సివిల్ జడ్జ్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షునిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై సత్యనారాయణ వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యంత సుదీర్ఘమైనదని రాజ్యాంగ పీఠిక భారతీయుల పౌరులందరికీ కుల మత జాతి లింగ వర్గ భేదం లేకుండా అందరికీ సమానమైన హక్కులు కల్పించిందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఏం ప్రభాకర్ మాట్లాడుతూ, రాజ్యాంగం దేశ ప్రజలందరికీ ప్రతి పౌరుడికి ఒక పవిత్రమైన గ్రంథం లాంటిదని, దీనిని ప్రపంచంలోనే అతి సుదీర్ఘకాలం లిఖించబడినటువంటి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ జ్యోతిలక్ష్మి, వృక్ష శాస్త్ర విభాగాధిపతి శ్రీ చంద్రయ్య, ఎగ్జామినేషన్ ఇంచార్జ్ శ్రీ ఏ శంకరయ్య, షీ టీం ఇన్చార్జ్ శ్రీమతి జి మానస , ఎం ఏ రహీం, రాపర్తి శ్రీనివాస్, శ్రీ మల్లారం శ్రీనివాస్ రెడ్డి, రజని, సంకీస సత్యం, జ్యోత్స్న, మాధవి, జమున, సునీత, ఇర్ఫానా, యాస్మిన్ సుల్తానా, ఎదునూరి నవీన్, గొల్లపల్లి తిరుపతి, సురేష్, అశ్విత నరసయ్య, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు