(J.Surender Kumar)
100 శాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీలు ముఖ్యమంత్రి గొప్ప ఆలోచనా విధానంతో తెలంగాణ ఫిష్ హబ్ గా మారుతోంది అని మంత్రి ఈశ్వర్ అన్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్, (వెల్లొండ) గ్రామంలోని బోలి చెరువు లో మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ లక్ష 30 వేల రొయ్య పిల్లలను వదిలారు
ఈ సందర్బంగా మంత్రి గారు మాట్లాడుతూ..
రాష్ట్రంలో కుల వృత్తులు అంతరించకుండా కాపాడేందుకు సీఎం కేసీఆర్ గారు సబ్సిడీ పై అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
మత్స్యకారులను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమీకృత మత్స్య అభివృద్ధి పథకం చేపట్టింది.
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి చేపల పెంపకం ద్వారా జీవనోపాధి లభిస్తుంది.
తెలంగాణ రాష్ట్రం మత్స్య సంపదలో మరింత వృద్ధి సాధిస్తుంది, ఇతర రాష్ట్రాల కు ఎగుమతి తో ముదిరాజ్, గంగ పుత్రులకు ఉపాధి పెరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత రాష్ట్రాన్ని ఫిష్ హబ్ గా తీర్చిదిద్దింది ముఖ్యమంత్రి మన కెసిఆర్ , ఈ అద్భుతమైన మార్పును ఏడు సంవత్సరాలలోనే జరిగిందన్నారు..

రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మత్స్యకారులకు రాయితీపై వాహనాలు, వలలు, తెప్పలు, ఇతర సామాగ్రిని సబ్సిడీ పై అందజేస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపలు ఎక్కడ దొరికేది అంటే రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం చేపల ఎగుమతులకు ప్రసిద్దిగా ఉండేది, కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత రాష్ట్రం ఫిష్ హబ్ మారి ఎగుమతి చేసే స్థాయికి చేరిందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో సొసైటీలను ఏర్పాటు చేసి నూతన భవనాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో సొసైటీల్లో ఉన్న మత్స్యకారులకు చేపలు పట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని అన్నారు.
మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు నష్టపోతున్నారు. వీటిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు, తెలంగాణలోని బీజేపీని రానిస్తే.. భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు
ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, బుగ్గారం జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, ధర్మపురి జెడ్పీటీసీ బత్తిని అరుణ, యంపిపి చిట్టిబాబు, డీసీఎంఎస్ చైర్మన్. శ్రీకాంత్ రెడ్డి బుగ్గారం వైస్ యంపిపి సుచెందర్ సర్పంచ్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
