(J. Surender Kumar)
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో, జిల్లాస్థాయిలో నిర్వహించిన కలోత్సవ్ 2022 -23 కార్యక్రమంలో జగిత్యాల పట్టణంలోని మానస ఎక్స్లెన్స్ స్కూల్ కు చెందిన 9వ తరగతి విద్యార్థిని శ్రీపాద మీనాక్షి ‘సోలో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ గిటార్ ఇన్ క్లాసికల్ ‘ విభాగం లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యింది.
. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థిని జగిత్యాల డీఈఓ జగన్మోహన్ రెడ్డి అభినందించి ధ్రువపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజితరావు, డైరెక్టర్లు శ్రీధర్ రావు , హరిచరణ్ రావు, మౌనిక రావు మరియు మ్యూజిక్ టీచర్ .కె. ప్రశాంత్ కుమార్ లు పాల్గొన్నారు.