ఎమ్మేల్యే డా. సంజయ్
( J. Surender Kumar)
మాజీ మంత్రి రత్నాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోనీ పద్మనాయక వెలమ సంక్షేమ మంటపం లో మాజీ మంత్రిస్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహాన్ని, గురువారం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ రత్నాకర్ రావు గారితో చిన్న నాటి నుండి సన్నిహిత సంబంధం ఉన్నదని అన్నారు., రాజకీయ నాయకునిగా, వ్యక్తి గా చాలా గొప్ప వ్యక్తి అని, రత్నాకర్ రావు గారి అడుగు జాడలలో పని చేయడానికి తమ వంతుగా కృషి చేస్తామని అన్నారు., నేడు వారి విగ్రహన్ని ఏర్పాటు చేయటం చాలా అభి నందనీయం అని, యువత రత్నాకర్ రావు గారి సేవలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో వారి కుమారులు నర్సింగరావు, కృష్ణరావు, చంద్రశేఖర రావు, , KDCC జిల్లా మెంబర్ రామ్ చందర్ రావు, మాజీ అధ్యక్షులు రాజేశ్వర రావు, పురుషోత్తం రావు, వెలమ సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర రావు,.ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, వెలమ కుల సంఘ సభ్యులు,కార్యవర్గ సభ్యులు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు
రత్నాకర్ రావు రాజకీయ నేపథ్యం ఇలా.
నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం!
ఆరు దశాబ్దాల రాజకీయ రంగంలో మచ్చలేని రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఆయన అలుపెరుగని రాజకీయ ప్రయాణం కొనసాగించారు. ఆయన వద్దకు అనేక అత్యున్నత పదవులు, పరుగు పరుగున వచ్చాయి. అధికార దర్పంతో, నియంతలా శాసించే అధికారం, ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఆయన ఆపద్బాంధవుడు అయ్యారు. అధికార, అనధికార తుపాకుల నీడలో, జీవనం కొనసాగించే మారుమూల గ్రామాల్లో సైతం ఆయన కలియ తిరిగారు, బడుగు, బలహీనవర్గాలకు తాగు, సాగు, నీరు, కూడు, గూడు, కల్పన కోసం ఆయన లక్ష్యం, ఆశయం, తపన, చూసి నక్సలైట్లు వర్గాలు సైతం ఆయన దారికి అడ్డు రాలేదు అడ్డంకులు సృష్టించ లేదు. తన చివరి శ్వాస వరకు ప్రజా సంక్షేమం పనుల కోసం పరితపించాడు. ఆయనే స్వర్గీయ మాజీ దేవాదాయ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు.
వివరాల్లోకి వెళితే !
రత్నాకర్ రావు ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో 1928 అక్టోబర్ 4న వెంకటేశ్వరరావు రుక్కమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు ఆరుగురు తోబుట్టువులు, ముగ్గురు సోదరులు ఆయన 2020 మే 10న స్వర్గస్తులైనారు. రెండు పర్యాయములు తిమ్మాపూర్ గ్రామం సర్పంచ్ గా రెండుసార్లు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పాలకవర్గ అధ్యక్షుడిగా 1989లో బుగ్గారం అసెంబ్లీకి స్వతంత్ర శాసనసభ్యుడిగా 1999, 2004లో ఎమ్మెల్యేగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలకవర్గ సభ్యులుగా ఆధునిక వ్యవసాయ పద్ధతుల అధ్యయనం కోసం రెండుసార్లు ఇజ్రాయిల్ దేశానికి ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన వెళ్లారు. వైయస్ రాజశేఖర్రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ స్టాంపులు శాఖ మంత్రిగా ఆయన కొనసాగారు. ధర్మపురి లోని శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాల పాలక వర్గ అధ్యక్షుడిగా చివరి శ్వాస వరకు కొనసాగారు.
క్లుప్తంగా…
తెలంగాణ వివక్షత పై గళమెత్తిన యోధుడు !

ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రి లో పుష్కర స్నానాలు అంటూ వేల కోట్ల నిధులు కేటాయించడం ఆ ప్రాంత అభివృద్ధి పరచడం తెలిసిం దె. 1991 గోదావరి పుష్కరాల సందర్భంగా సీమాంధ్ర ప్రభుత్వం తో తెలంగాణలో గోదావరి నది ఉందని ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి నిధులు ఇవ్వండి అంటూ స్వర్గీయ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు, తో కలిసి మంథని, కాళేశ్వరం, ధర్మపురి క్షేత్రాలకు 30 లక్షల నిధులు మంజూరు చేయించారు.
సారంగాపూర్ మండలానికి రెండు జూనియర్ కాలేజీలు!
వైయస్ ప్రభుత్వ హయాంలో మండలానికో ప్రభుత్వ జూనియర్ కళాశాల ను మంజూరు చేయగా, నియోజకవర్గంలోని సారంగాపూర్ మండలం నైసర్గిక గంగా బీర్పూర్ గుట్ట కింద.10 గ్రామాలు సారంగాపూర్ పరిధిలో10 ఉన్నాయి రెండు ప్రాంతాల ప్రజలు తమ తమ అ ప్రాంతం కే కళాశాల అంటూ పోటీ పడగా అప్పటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి నీ ఒప్పించి ఒకే మండలానికి రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయించి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చరిత్ర సృష్టించారు.
నక్సలైట్లను, రాజకీయ ఖైదీలుగా!
వైయస్ ప్రభుత్వ హయాంలో నక్సలైట్లకు ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు జరిగాయి అందులో అనేక డిమాండ్లతో పాటు 1995 నవంబర్ 15న జీవితకాల శిక్ష పడిన నక్సలైట్లు బీర్పూర్ కు చెందిన సముద్రాల మల్లేశం, తుంగుర్ కు చెందిన శీలం రమేష్, ఆదిలాబాద్ కు చెందిన బండి ప్రకాష్ ను, భేషరతుగా, రాజకీయ ఖైదీలు గా విడుదల చేయాలని అప్పుడు చర్చలో పాల్గొన్న నక్సలైట్ నాయకులు అక్కిరాజు రామకృష్ణ, ఆజాద్ డిమాండ్ పెట్టారు. చర్చలు అర్ధాంతరంగా ముగిసిన అప్పటి మంత్రివర్గంలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రత్నాకర్ రావు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి రాజకీయ ఖైదీ లు. గా ఈ నక్సలైట్ నాయకులను రాజకీయ ఖైదీలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ద్వారా ప్రత్యేక జీవోను జారీ చేయించి విడుదల చేయించారు.
తెలంగాణ పక్షపాతి!
నవంబర్ 16 2005వ సంవత్సరంలో జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జర్నలిస్ట్ సంఘం పక్షాన ” తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మీడియాలో వ్యక్తీకరణ ” అనే అంశంపై కరీంనగర్ ప్రెస్ భవన్లో సెమినార్ జరిగింది. ఈ సమావేశంలో ప్రొఫెసర్ స్వర్గీయ జయశంకర్ సార్ ఆచార్య స్వర్గీయ బియ్యాల జనార్దన్ రావు, ఆంధ్ర ప్రదేశ్ జాతీయ మీడియా ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ ,ప్రస్తుత తెలంగాణ మీడియా చైర్మన్ అల్లం నారాయణలు పాల్గొన్నారు.. ఈ సెమినార్ లో పాల్గొన్న రత్నాకర్ రావు తెలంగాణ ప్రాంతం పట్ల జరుగుతున్న వివక్షత, దోపిడికి గురి అవుతున్న తీరుతెన్నులు తదితర అంశాలను ఆయన వివరించడంతో ఆ సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన ప్రసంగంలో రత్నాకర్ రావు కు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ మీకు నేను శిరస్సువంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను సర్ అంటూ తన ప్రసంగంలో పేర్కొనడం గమనార్హం.
ధూపదీప పథకం. జువ్వాడి హాయంలోనే !దేవాదాయ శాఖ మంత్రిగా జువ్వాడి కొనసాగిన ఈ సమయంలో ధర్మపురి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ముప్పై రెండు గదుల నిర్మాణం శ్రీ నిధి నుంచి కోటి రూపాయలు మంజూరు చేస్తూ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన అన్నవరం, శ్రీశైలం, ద్వారకా తిరుమల, సింహాచలం, విజయవాడ కనకదుర్గ, భద్రాచలం, యాదగిరిగుట్ట ఆలయం నుంచి దాదాపు కోటి రూపాయలు దేవాలయం నిధులను విరాళంగా సాధించిన ఘనత ఆయనది. రాష్ట్రంలో దూప దీప నైవేద్యం పథకానికి తను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి సంతకం ఆ ఫైలు పైనే ఆయన చేశారు.
జువ్వాడి విగ్రహం చారిత్రిక అవసరం !
జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహ ఏర్పాటు ఒక చారిత్రక అవసరం భావితరాల సమాజం ఈయన సేవలు గుర్తించడానికి, తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. రాజకీయాలకతీతంగా విలువల తో కూడిన రాజకీయ నేపథ్యంలో
సాగు , తాగు ప్రాజెక్టు పథకాలు, కోరుట్ల పట్టణంలో ఉమ్మడి రాష్ట్రంలో తొలి పశు పశు వైద్య కళాశాల ఏర్పాటు తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలు పథకాలు ఇందిరమ్మ ఇళ్లు. నేటికీ జగిత్యాల జిల్లా లోని మారుమూల గ్రామాల్లో ప్రత్యక్షంగా అగుపిస్తాయి.నిస్వార్థ, నిజాయితీ రాజకీయాలకు, రాజకీయ విలువలకు , స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు నిలువెత్తు నిదర్శనంగా, అపర చాణక్యుడిగా రాజకీయ భీష్మాచార్యుడు చరిత్ర పుటలలో కొనసాగుతున్నారు, కొనసాగుతారు కూడా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.