రేపే చంద్రగ్రహణం!
ఆందోళన అవసరం లేదు !

పండితుడు గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ !

(J. Surender Kumar)
నవంబర్ 8 తేదీన సంభవించే చంద్రగ్రహణం వలన ఏర్పడే ఫలితాలు కూడా నామమాత్రంగానే ఉంటాయని ,కాబట్టి అతిగా ఊహించుకొని ఆయా రాశులవారు, బాధ పడే అవసరం లేదని ప్రముఖ జ్యోతిష్య పండితుడుగొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ విశ్లేషించి వివరించారు.


ఈ సంవత్సరంలో రెండోది మరియు చివరిది ఈ చంద్రగ్రహణం అన్నారు. శర్మ ఇలా వివరించారు.
గ్రహణ సమయం.
ఈ సంవత్సరం కార్తీక శు. పూర్ణిమ, మంగళవారం రోజున భరణీ నక్షత్రములో, మేష రాశిలో, రాహు గ్రస్త చంద్ర గ్రహణం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 02:39 నుంచి సాయంత్రం 06:19 వరకు ఈ గ్రహణం ఉంటుంది. గ్రహణ స్పర్శ కాలం మధ్యాహ్నం 02: 39 అయినా, సూర్యాస్తమయం తర్వాతే పుణ్యకాలం ప్రారంభమవుతుంది.

జ్యోతిష పండితుడు గొల్లపల్లి సంతోష్ శర్మ!

గ్రహణం అగుపించే ప్రాంతాలు !

భారతదేశం లోని వివిధ పట్టణాలతో పాటు, ప్రపంచంలో ఈ గ్రహణం కనిపించే ఈ చంద్రగ్రహణం ఉత్తర మరియు తూర్పు ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, .పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఉత్తర అమెరికా, మరియు దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది.
భారత దేశంలో ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. అయితే ఈశాన్య రాష్ట్రాలలో ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపిస్తే, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో పాక్షికంగా కనిపిస్తుంది.


(గ్రహణం పూర్తి వివరాలు సమాచారం కోసం ‘ఓం శ్రీ సాయి జ్యోతిష్య విద్యాపీఠం’ వెబ్సైట్.. https://www.onlinejyotish.com/ ద్వారా సమాచారం తెలుసుకునే అవకాశం ఉందని ఆయన వివరించారు.)

గ్రహణం రోజు చేయాల్సిన, చేయకూడని పనులు ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం, 02 గంటల 39 నిమిషాలకు ప్రారంభమయ్యి, సాయంత్రం 06 గంటల 19 నిమిషాలకు ముగుస్తుంది. అయితే చంద్రగ్రహణ పుణ్యకాలం, సూర్యాస్తమయం, తర్వాత ప్రారంభం అవుతుంది, కాబట్టి మీరు నివసించే పట్టణం సూర్యాస్తమయ సమయ ప్రకారం గ్రహణ పుణ్యకాలాన్ని ఆచరించాలన్నారు.

చంద్రగ్రహణం ఆరంభానికి ముందు 3 ప్రహరలు, అంటే 9 గంటల ముందు కాలం నుంచి అంటే తెల్లవారు ఝామున 05 గంటల 39 నిమిషాలకు గ్రహణ వేధ ప్రారంభం అవుతుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి స్నానం, గ్రహణ వేధ ప్రారంభం కాక ముందు చేయవచ్చు. అలాగే శారీరకంగా సమర్థులు అయినవారు ఈ రోజు గ్రహణం పూర్తయ్యే వరకు భోజనాదులు చేయరాదని శాస్త్ర వాక్యం. అశక్తులు, అంటే చిన్నపిల్లలు, గర్భిణులు, రోగగ్రస్తులు, మరియు వృద్ధులు, గ్రహణ వేధ సమయము నుండి ఒక యామము విడిచిపెట్టి అంటే ఉదయం 11 గంటల 39 నిమిషాల లోపు భోజనాలు పూర్తి చేయాలి. అని శాస్త్రంలో పేర్కొన్నట్టు పండితుడు వివరించారు.
ఏ రాశి పై చంద్ర గ్రహణ ప్రభావం.!
ఈ గ్రహణం ఏ రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. అలాగే ఏ రాశి వారు చూడొచ్చు, ఏ రాశి వారు చూడకూడదు అనే అంశంలో ఈ చంద్రగ్రహణం మేష రాశి, భరణి నక్షత్రములో సంభవిస్తున్నది కాబట్టి మేష, వృషభ, మకర, మరియు కన్యా రాశులలో జన్మించినవారికి అనుకూలంగా ఉండదు. కనక వారు గ్రహణం చూడకపోవటం మంచిది. ఈ గ్రహణం మిథున, కర్కాటక , వృశ్చిక, మరియు కుంభ రాశులలో జన్మించిన వారికి శుభ ఫలితాలు, మిగతా రాశుల వారికి మధ్యమ ఫలితం పొందుతారు.
మేష రాశి.
ఈ రాశి వారికి 1వ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ, నదీతీరంలో గాని సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి.
మిథున రాశి.
ఈ రాశి వారికి 11వ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడవచ్చు అలాగే గ్రహణ విషయంగా ప్రత్యేక నియమాలు పాటించటం అవసరం లేదు. వీలైన వారు నదీ స్నానం చేయటం లేదా దైవదర్శనం చేసుకోవడం మంచిది.
కర్కాటక రాశి.
ఈ రాశి వారికి 10వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ప్రత్యేకించి ఏ నియమాలు పూజలు పాటించనవసరం లేదు. బుధవారం తెల్లవారు దగ్గర ఉన్న నదిలో స్నానం చేయడం మంచిది, లేదా దైవ దర్శనం చేసుకోవడం మంచిది.
సింహ రాశి.
ఈ రాశి వారికి చంద్ర గ్రహణం వారి రాశి నుంచి 9 వ రాశి లో వస్తుంది కాబట్టి వారు గ్రహణాన్ని ని చూడవచ్చు, అలాగే ప్రత్యేకించి ఏ రకమైన నియమాలు పాటించటం అవసరం లేదు. నదీతీరంలో లో నివసించేవారు నదీ స్నానం చేయటం, లేదా గ్రహణానంతరం దైవ దర్శనం చేసుకోవడం మంచిది.
కన్యా రాశి.
ఈ రాశి వారికి 8 వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీతీరంలో గాని సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి.
తులా రాశి.
ఈ రాశి వారికి 7 వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీతీరంలో గాని సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి.
వృశ్చిక రాశి.
ఈ రాశి వారికి 6వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ప్రత్యేకించి ఏ నియమాలు పూజలు పాటించనవసరం లేదు. బుధవారం తెల్లవారు దగ్గర ఉన్న నదిలో స్నానం చేయడం మంచిది లేదా దైవ దర్శనం చేసుకోవడం మంచిది.
ధనూ రాశి.
ఈ రాశి వారికి 5వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడవచ్చు అలాగే గ్రహణ విషయంగా ప్రత్యేక నియమాలు పాటించటం అవసరం లేదు. వీలైన వారు నదీ స్నానం చేయటం లేదా దైవ దర్శనం చేసుకోవడం మంచిది.
మకర రాశి.
ఈ రాశి వారికి 4 వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీతీరంలో గాని సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి.
కుంభ రాశి.
ఈ రాశి వారికి మూడవ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడవచ్చు అలాగే గ్రహణ విషయంగా ప్రత్యేక నియమాలు పాటించటం అవసరం లేదు. వీలైన వారు నదీ స్నానం చేయటం లేదా దైవదర్శనం చేసుకోవడం మంచిది.
మీన రాశి.
ఈ రాశి వారికి 2 వ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీతీరంలో గాని సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి.
చంద్రుడు మనస్సుకు, ఆలోచనకు కారకుడు, రాహువు మనలోని అహంకారానికి, మూర్ఖత్వానికి మరియు మొండి ధైర్యానికి కారకుడు.
ఈ చంద్ర గ్రహణ సమయంలో జరిగే చంద్ర, రాహు సంయోగం వలన మేష, వృషభ, కన్య, తుల, మకర, మరియు మీన రాశుల వారికి మానసిక ఆందోళన పెరగటం, ఎవరినీ లెక్క చేయని స్వభావం పెరగటం, మూర్ఖ నిర్ణయాల కారణంగా ఆత్మీయులకు దూరం అవటం, ఖర్చులు పెరగడం, అలాగే మొండి ధైర్యం కారణంగా అనవసర సమస్యలకు లోనవటం జరగవచ్చు. అంతేకాకుండా బంధువులతో, మిత్రులతో వైరం ఏర్పడటం కాని, లేదా మీ గురించి తప్పు విషయాలు ప్రచారం జరగడం గాని ఈ గ్రహణం కారణంగా రాబోయే రోజుల్లో (అంటే దాదాపు 6 నెలల వరకు) ఈ ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు శివారాధన చేయడం, దుర్గా ఆరాధన చేయటం, అలాగే మనకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం వలన చాలా వరకు సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. అని జ్యోతిష పండితులు వివరించారు.
ఈ గ్రహణం వలన ఏర్పడే ఫలితాలు కూడా నామమాత్రంగానే ఉంటాయి కాబట్టి దీని గురించి ఎక్కువగా ఊహించుకొని బాధ పడే అవసరం లేదని సంతోష్ శర్మ స్పష్టం చేశారు.