నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా..
పాల్గొన్న మాజీ ఎం పి పొన్నం ప్రభాకర్
(J. Surender Kumar)
నిధులకేటాయింపు విషయంలో నెలరోజులలో స్పష్టత రాకపోతే కార్యాచరణ తీసుకుంటామని నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హెచ్చరిక
కరీంనగర్ సమీపంలో తీగలగుట్టపల్లి వద్ద నిర్మించాల్సిన రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబి) కి నిధులు కేటాయించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నువ్వంటే, నువ్వని, జాప్యం చేస్తూ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నారని మాజీ ఎం పి పొన్నం ప్రభాకర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం రైల్వే ట్రాక్ పక్కన రోడ్డుపై ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్రిడ్జి నిర్మాణానికి కావాల్సిన నిధులు కేంద్ర వాటా, రాష్ట్ర వాటా కేటాయింపులో బిజెపి, టీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్దిలేక నిర్మాణం జరగడం లేదని అన్నారు, బండి సంజయ్ కరీంనగర్ కు కేంద్రం నుండి నిధులు తీసుకురావడంలో విఫలం అయ్యాడని, మంత్రి గంగుల కేవలం పత్రిక ప్రకటనలకే పరిమతమవుతున్నారనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిత్త శుద్దిలేదని పేర్కొన్నారు, నెలరోజులలో బ్రిడ్జి నిర్మాణంపై స్పష్టత రాకపోతే కార్యాచరణ తీసుకొని ఉద్యమం ఉదృతంచేస్తామని నరేందర్ రెడ్డి హెచ్చరించారు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో రైల్వే స్టేషన్ కు పొన్నం ప్రభాకర్ ఎం పి గా చేసిన అభివృద్ది తప్ప రూపాయి నిధులు కేటాయించలేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు, గతంలో ప్లాట్ ఫాం లు చేసిన అభివృద్దిపై లారీఅసోసియేషన్ నాయకులు సమద్ నవాబ్, కమ్రొద్ధిన్ వివరించారు, ట్రాక్ వద్ద కమాన్ ఎత్తుతగ్గించి గూడ్స్ లారీలు పెద్దపల్లి రోడ్డువైపుమళ్లించి పెద్దస్కాం కు పాల్పడుతున్నారు అన్నారు,
ధర్నా లో నాయకులు సమద్ నవాబ్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి కంరుద్దిన్ , రహమత్ హుస్సేన్, పడాల రాహుల్, శ్రావణ్ నాయక్, కర్ర సత్య ప్రసన్న రెడ్డి ,పులి అంజనేయులు గౌడ్, గుండాటి శ్రీనివాసరెడ్డి, అబ్దుల్ రహమాన్, మేనేని రోహిత్ రావు ,మడుపు మోహన్, వెన్న రాజ మల్లయ్య, రాచకొండ ప్రభాకర్, మల్యాల సుజిత్ కుమార్ ,గడ్డం విలాస్ రెడ్డి, ఇర్ఫాన్ ,సలీముద్దీన్, రోళ్ల సతీష్ ,లింగంపల్లి బాబు, కుర్ర పోచయ్య ,బోనాల శ్రీనివాస్, పులి కృష్ణ, ముసర్ల రామ్ రెడ్డి, షబానా మహమ్మద్, షహిన్షా ,కల్వల రామచందర్, దన్ను సింగ్, దండి రవీందర్ ,మేకల నరసయ్య ,శ్యామ్ సుందర్ రెడ్డి ,ముక్క భాస్కర్, జీడి రమేష్, ఎస్డి అజ్మత్ ,నాగుల సతీష్, ది కొండ శేఖర్ ,నవాజ్, హనీఫ్, జాఫర్ ,కమల్, అష్రాఫ్, జవార్ ,దాసరి నరసింహ రెడ్డి, ఎజ్రా, కాంతయ్య ,మనోహర్, మహమ్మద్ ఇమామ్, సోహెల్, కీర్తి కుమార్, కుంభాల రాజకుమార్, మంద మహేష్, అనిల్ ముదిరాజ్ ,పెద్ది రాజేందర్, సిరికొండ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.