రోళ్ళ వాగు రైతుల కోసం  ₹16 కోట్లు మంజూరు!

ఎమ్మెల్యే సంజయ్ కుమార్.


(J. Surender Kumar)

లాండ్ అక్విసిషన్ కోసం గతంలో రైతులకు 16 కోట్లు మంజూరు చేయటం జరిగింది. ఎమ్మెల్యే వివరించారు.

బీర్ పూర్ మండలం లోని రోళ్ళ వాగు ప్రాజెక్ట్ పనులు పునః ప్రారంభం కు అధికారులు, నాయకులతో కలసి శనివారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
లాండ్ అక్విసిషన్ కోసం గతంలో రైతులకు 16 కోట్లు మంజూరు చేయటం జరిగింది అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఐదుగురు ముఖ్యమంత్రులు మారారు,కేంద్రం జాతీయ హోదా సైతం ఇచ్చింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో వివిధ కారణాల వల్ల జాప్యం సహజం


₹130 కోట్లతో నేడు ప్రాజెక్ట్ పనులు చేపట్టడం జరిగింది
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలు., కడెం ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్తితి ఏర్పడింది.. అధికారులే చేతులు ఎత్తేశారు…
గత ప్రభుత్వాలు రోళ్ళ వాగు పూర్తి  చేసి ఉంటే ఈ పరిస్తితి వచ్చేది కాదు ….
ఉమ్మడి జిల్లా మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి ప్రాజెక్ట్ కోసం నిదులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు…
రోల్ల  వాగు పై ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు జీవన్ రెడ్డి కి లేదు. అన్నారు.
వచ్చే జనవరి నుతన సంవత్సరం నాటికి రోళ్ళ వాగు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.

పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ !

బీర్ పూర్ మండల కోలవాయి గ్రామంలో ₹16 లక్షల తో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతి భవనాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. . మండలానికి చెందిన 28 మందికి  కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన ₹28 లక్షల రూపాయల  చెక్కులను, 11 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ₹2లక్షల 42 వేల చెక్కులను అందించారు.


ఈ కార్యక్రమంలో సర్పంచ్ యేసు దాసు,.ఉప సర్పంచ్ తిరుపతి, ఎంపీపీ రమేష్, KDCC జిల్లా మెంబర్ రామ్ చందర్ రావు,  జెడ్పీటీసీ పద్మ, జిల్లా, మండల  రైతు బందు సమితి కన్వీనర్,  కోలుముల రమణ, మెరుగు రాజేశం, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్, సర్పంచుల ఫోరం మహిపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నారపకా రమేష్,.యూత్ మండల అధ్యక్షులు రామచంద్రం గౌడ్, మండల నాయకులు, కార్యకర్తలు,ప్రజలు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.