తెలంగాణ అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ యూనియన్ (CITU) కార్యదర్శి జయలక్ష్మి!
( J. Surender Kumar )
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో కామ్రేడ్” మల్లు స్వరాజ్యం ప్రాంగణంలో 2వ మహాసభ లు ప్రారంభం అయ్యాయి., ఈ మహా సభలకు అధ్యక్షవర్గం ఏ. రజిత, జై.మాధవి, లత,ఎస్. సమ్మక్క వ్యవహరించారు.
ఈ సందర్భంగా P. జయలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అంగనవాడి ఉద్యోగుల చేత చట్ట బద్ధమైన సౌకర్యలు చేయకుండా వారితో వెట్టి చాకిరి చేయించుకుంటుందన్నారు. కనీసం వేతనం 26,000 /- రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బ్రైట్ వెట్టి సౌకర్యం అమలుకై పోరాటాలను ఉధృతం చేయాలని అంగనవాడి ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఆన్లైన్ యాప్ లు ఒకవైపు, రిజిస్టర్లు నిర్వహించడం వల్ల అధిక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు, జిల్లాలో పెండింగ్లో ఉన్న 2017 నుండి ఉన్న TA, DA చెల్లించాలని, వంటగ్యాస్ ప్రభుత్వం సరఫరా చేయాలని ,సెంటర్ అద్దెలను చెల్లించాలని ఆరోగ్య లక్ష్మి బిల్లులను పెంచాలని జిల్లా మహాసభ తీర్మానం చేయడం జరిగింది..

నూతన జాతీయ విద్యా విధానం కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఈ మహాసభ డిమాండ్ చేసింది.
ఈ మహాసభకు యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జి జ్యోతి, CITU జిల్లా కన్వీనర్ జి. తిరుపతి నాయక్, అంగన్వాడి టీచర్ అధ్యక్షులు కార్యదర్శులు ఏ. రజిత, J. శైలజ, సుమలత, s. స్వరూప రాణి, పార్వతి, లావణ్య, మరియా, యు. భాగ్య, జయప్రద, మణి, అమ్మ , వనితా తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలి టిఎస్ సి పి ఎస్ ఈ యు.
జాతీయ పెన్షన్ పథకాన్ని అంగీకరించి అమలు జరుపుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు బయటకు వచ్చే స్వేచ్ఛ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానిచటాన్ని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (టిఎస్ సి పి ఎస్ ఈ యు) జగిత్యాల జిల్లా కమిటీ పత్రికా ప్రకటనలలో తీవ్రంగా ఖండించింది.
2004లో ఎన్ డి ఏ ప్రభుత్వం జాతీయ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టగా తదనంతరం అధికారంలోకి వచ్చిన యుపిఏ ప్రభుత్వం రాష్ట్రాల్లో ఎన్పీఎస్ ను అమలు జరిపించిందని గుర్తుచేశారు. కుటుంబాల సామాజిక భద్రత పట్ల ఆందోళన చెందుతున్న సిపిఎస్ ఉద్యోగులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు దేశవ్యాప్తంగా సిపిఎస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో పాలక పక్షాలు రాజకీయ అస్థిత్వం కోసం ఉద్యోగుల డిమాండ్ కు తలొంచక తప్పటం లేదన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్, జిల్లా అధ్యక్షులు గంగాధరి మహేష్,.బోగ శ్రీనివాస్,బండారి సతీశ్, వీరబత్తిని శ్రీనివాస్,వంశీ,సుధాకర్, తదితరుల పేర్లతో ప్రకటన విడుదల చేశారు.