సంఘ సభ్యులు చేయూతనిచ్చారు !

( J. Surender Kumar )
ధర్మపురి పట్టణం కాశెట్టి వాడకు చెందిన సోంశెట్టి నర్సయ్య , గత కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు.
వారి కుటుంబ దయనీయ దుస్థితి నేపథ్యంలో స్థానిక మున్నూరు కాపు సంఘం పాలక మండలి సభ్యులు, శనివారం సంఘ పక్షాన ₹ 28000/- ఆర్థిక సహాయం చేసి వారికి మనోధైర్యం కల్పించారు.

కాపు సంఘ అధ్యక్షుడు సంగి రాజశేఖర్, కార్యదర్శి చల్ల గంగన్న, ఉపాధ్యక్షుడు. కాశెట్టి రాంబాబు, కౌన్సిలర్ అయ్యోరి వేణుగోపాల్, జర్నలిస్ట్ బొంగురాల రాజేష్, సభ్యులు పురం శెట్టి నాగేష్, తోట రాజన్న, ఆశెట్టి శ్రీనివాస్, చుక్క రవి , చుక్క భీమ్ రాజ్ , ఆకుల శ్రీనివాస్, చీర్నేని నర్సయ్య , కొడిమ్యాల నర్సయ్య, కాశెట్టి రాజేష్ , ఓడ్నాల భూమేష్ , తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.

మాల ఐక్యవేదిక సంఘ అధ్యక్షుడిగా రాయమల్లు !

ధర్మపురి మండలం రాయపట్నం మాల ఐక్యవేదిక సంఘ అధ్యక్షుడిగా . పడిదం రాయమల్లు,.మిగతా కార్యవర్గం శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడి గా బాలమల్లు , ప్రధాన కార్యదర్శిగా బొజ్జ మల్లన్న,.సంయుక్త కార్యదర్శి .నాస శంకరయ్య,.ప్రచార కార్యదర్శి నాస అనిల్ కుమార్, కోశాధికారి నాస సురేష్,లు. ఎన్నికయ్యారు.
తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం, ఆదేశాలతో ధర్మపురి మండల అధ్యక్షుడు అనంతుల లక్ష్మణ్, తో పాటు,
కాళ్ళ సత్తయ్య, దాసరి విజయ్, జంజిరికాని .శ్రీనివాస్, కడారి రాజేష్, కాళ్ల లచ్చన్న,.రవి మ్యాన విద్యసాగర్, బోనాల రాజన్న, సమక్షంలో జరిగాయి.
ఈ కార్యక్రమంలో ప్రతినిధులు బొజ్జే శంకరయ్య, పల్లె పోచయ్య, నాస బాబు, బేర రాజయ్య, కండ్లే భూమయ్య, నాస స్వామి, బొజ్జ మల్లేశం, నాస సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా సత్యం !

ధర్మపురి మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు గా మచ్చ సత్యం, ప్రధాన కార్యదర్శి గా గడ్డం అనిల్, ఉపాధ్యక్షులు గా జుంజూరు అశోక్, ఆడేపు బాపన్న, భోగ రమేష్, సంయుక్త కార్యదర్శులు గా కురిక్యాల రాజేశం, బాలే మల్లయ్య, వేముల మల్లేశం, కోశాధికారి గా అయ్యోరి సత్తయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం జరిగిన ఎన్నికల్లో, ఎన్నికల అధికారులుగా భోగ శివప్రసాద్, మ్యాన పవన్ లు వ్యవహరించారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు వెలుగందుల నాగభూషణం , మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్, జైన ఇంచార్జి సర్పంచ్ కురిక్యాల మహేష్, మార్కెట్ డైరెక్టర్ గాజుల సత్తయ్య, తుమ్మెనాల ఎంపీటీసీ ఆకుబత్తిని తిరుపతి,.ఆలయ డైరెక్టర్ వేముల నరేష్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు నక్క రాజేందర్, కొంక వరప్రసాద్, నాయకులు, వేముల రాజన్న, కటకం రాజన్న,.వేముల మల్లేశ్, అన్నందాసు శ్రీనివాస్, సామల చంద్రయ్య, అల్లే మురళి, మచ్చ మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు .

ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిగా మహేష్ !

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా లసెట్టి మహేష్ ఉపాధ్యక్షునిగా సంపంగి రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరుసగా నాలుగవసారి అధ్యక్ష పదవికి మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మహేష్ రవిలను శుభాకాంక్షలు తెలుపుతూ పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
.ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ట్రాక్టర్ యూనియన్ ఉన్నతి కోసం తనవంతు కృషి చేస్తానని, త ఏకగ్రీవ నియామకంకు సహకరించిన సభ్యులందరికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు చెరుకు తిరుపతి, చిర్నేని నర్సయ్య, పుప్పాల శ్రీనివాస్, అయ్యోరి మహేష్, వెల్ముల పద్మాకర్,.ఒల్లెపు శంకర్రాజు, L భగవంత రావు, ఉప్పుల తిరుపతి, కాశెట్టి సురేష్, వీరవేణి కొమురయ్య ,గాడిచెర్ల తిరుపతి .తదితరులు పాల్గొన్నారు.

.