ఎమ్మెల్యే పై మండిపడ్డ టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణారావు!
(J. Surender Kumar)
ఇబ్రహీంపట్నం మండలం యామపూర్ గ్రామంలో పర్యటించిన టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణ రావు మాట్లాడుతూ, కోరుట్ల ఎమ్మెల్యే మరియు అప్పటి ఎంపీ. ముఖ్యమంత్రి కుమార్తె కవిత తేదీ:16-04-2018 నాడు డబుల్ బెడ్ రూమ్ ల కోసం శిలాఫలకం వేసి .శంకుస్థాపన చేసి ఇప్పటికి నాలుగు సంవత్సరాల ఏడూ నెలలు గడుస్తున్నా పేదల కోసం ఏర్పటు చేయాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఇప్పటి వరకు తట్టెడు మట్టి పోసిన పాపాన లేదు అని టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణ రావు ఆరోపించారు.

. ఎమ్మెల్యే రాష్ట్రని హామీల కమిటీ చెర్మెన్ వున్నారు. కానీ మీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల హామీలు మాత్రం మీరు నెరవేర్చడం లేదని అన్నారు. మీరు హామీల కమిటీల చెర్మెన్ కాదు. హామీలు నెరవేర్చని కమిటీ కి మీరు చెర్మెన్ అని ట కృష్ణ రావు అన్నారు. అప్పటి ఎంపీ కవిత వచ్చి శంకుస్థాపన చేసి వెళ్లారు గాని ఎందుకు మా నియోజకవర్గ ప్రజలను ఎందుకు పట్టిచుకోవడమ లేదు అని ప్రశ్నించారు. అయ్యా ఎమ్మెల్యే మీ మాటలు నీటి మూటలు అయ్యాయి అని తెలపడానికి ఈ శిలాఫలకం సాక్ష్యం అని అన్నారు..అయ్యా ఎమ్మెల్యే ప్రజల హామీలను గాలికి వదిలేసిన మీరు వేటనే రాజీనామా చేయండి .ఎందుకే అంటే ఎక్కడ అయితే ఉప ఎన్నికలు వస్తే అక్కడ ఉన్న సమస్యలు అన్ని పరిష్కారం దొరుకుతుంది అని అన్నారు.. ఆయన వెంట కార్యక్రమంలో కె. లింగారెడ్డి. యమపూర్ శ్రీనివాస్. క్యాతం రవి. క్యాతం తిరుపతి రెడ్డి. దశరదం. క్యాతం రమేష్.ప్రశాంత్. మోర్తటి దేవరెడ్డి.కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజాం.మెటుపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందే మారుతి. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు ఉన్నారు.