( J. Surender Kumar)
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో గల స్థానిక (తెలంగాణ క్రీడా ప్రాంగణం) జూనియర్ కళాశాల మైదానం ఆవరణలో గల నూతన భవనంలో బుధవారం సేవా భారతి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
కరీంనగర్ పట్టణలో గల స్థానిక మెడి కవర్ ఆసుపత్రి సహాయ సహకారంతో.. ధర్మపురి సేవా భారతి వారి ఆధ్వర్యంలో కొనసాగింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పోలీస్ రాత పరీక్ష, ఫలితాలు విడుదల అయి ఈవెంట్స్ లకు అర్హత సాధించిన కానిస్టేబుల్, యస్ఐ, అభ్యర్థులకు, వారి ఆరోగ్య పరిస్థితుల రీత్యా అభ్యర్థులను దృష్టిలో ఉంచుకోని, వారికి బీపీ, ఈసీజీ, షుగర్, హైట్, వెయిట్, పల్స్, టెంపరేచర్, రక్త పరీక్షలు నిర్వహించి, వారికి ఈవెంట్స్ పట్ల మెడి కవర్ ఆసుపత్రి సీనియర్ వైద్యుడు బి నిఖిల్ ఈవెంట్స్ పట్ల తీసుకోవల్సిన అంశాల పట్ల అవగాహన కల్పించారు.

వైద్య శిబిరంలో సుమారు ఎనభై మంది అభ్యర్థులతో పాటు, స్థానిక పరిసర ప్రాంత ప్రజలు నూట ఇరవై మందికీ. ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో.. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, సుమారు లక్ష రూపాయలకు పైగా విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ బి నిఖిల్, క్యాంపు క్యాంపు కో – ఆర్డినేటర్ కిరణ్ కుమార్, పీఆర్ఓ మహేష్, ల్యాబ్ టెక్నీషియన్స్ అంజలి, అనిల్ లకు, ధర్మపురి సేవా భారతి ఇంచార్జ్ రంగు లక్ష్మీ నరహరి ఆధ్వర్యంలో.. వారికి లక్ష్మీనరసింహ స్వామి వారి ప్రసాదాన్ని అందజేసి, శాలువా కప్పి, ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో సేవా భారతి నిర్వాహకులు రంగ హరినాథ్, స్థంభంకాడి జగదీష్, రాయిల్లా రవి కుమార్, అక్కినపెల్లి బాబు కుమార్, జైషెట్టి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.