శ్రీశైలం దేవుడి కార్తిక మాసం ఆదాయం ₹30.89కోట్లు


(J. Surender Kumar)


కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం దేవస్థానానికి ₹.30,89,27,503ల ఆదాయం వచ్చిందని దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న తెలిపారు. గత ఏడాది కంటే రూ.11.02కోట్ల ఆదాయం అధికంగా వచ్చినట్లు చెప్పారు.

కర్నూలు జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరిగాయి. కార్తీక మాసం సందర్భంగా భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దాదాపు 10లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. ఈక్రమంలో శ్రీశైలం దేవస్థానానికి ₹30,89,27,503ల ఆదాయం వచ్చిందని దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న తెలిపారు. గత ఏడాది కంటే ₹11.02కోట్ల ఆదాయం అధికంగా వచ్చినట్లు తెలిపారు.  ఈ మొత్తం ఆదాయం. దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలు, లడ్డు ప్రసాదాలు, టోల్‌గేట్‌, విభూది, కంకణాలు, ప్రచురణల విక్రయాలు, తులాభారం, కేశఖండన, ఆన్‌లైన్‌ సేవలు, హుండీ ఆదాయం, వివిధ పథకాల ద్వారా వచ్చినట్లు ఈవో వెల్లడించారు.