ధర్మపురి క్షేత్రంలో…
( J. Surender Kumar )
ప్రముఖ హృద్రోగ చికిత్స నిపుణులు డా. శ్రీధర్ కస్తూరి సౌజన్యంతో ధర్మపురికి చెందిన ప్రముఖ గీత రచయిత డా. గొల్లపల్లి రాఖీ రచించగా, ప్రముఖ సంగీత దర్శకులు కోమాండూరి రామాచారి, స్వర కల్పనలో రూపొందించిన ఆడియో గీతాల ఆల్బమ్ * శ్రీ వేంకటేశం * ఆదివారం స్థానిక బ్రాహ్మణ సంఘం భవనంలో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది

కుటుంబ సభ్యులు, మిత్రులు, స్థానికుల సమక్షంలో ఆవిష్కరించబడ్డ ఈ ఆల్బమ్ లోని పాటలను ప్రఖ్యాత సినీ గాయకులు రమ్య బెహెర, గీత మాధురి, శ్రీకృష్ణ తదితరులు ఆలపించారు.
ఎంతో భక్తి శ్రద్ధలతో గీతాలను రాసిన రచయిత రాఖీని, వాటిని ఆడియో రూపంలో రావడానికి చేయూతనిచ్చి, ఆల్బమ్ ఆవిష్కరణ కోసం కృషి చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డా. శ్రీధర్ కస్తూరి ని పలువురు అభినందించి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో డా. శ్రీధర్ ధర్మపత్ని శ్రీమతి సునీత, హైకోర్టు న్యాయవాది కస్తూరి లక్ష్మి మనోహర్, విద్యావేత్త కస్తూరి రవీందర్, గీత రచయిత డాక్టర్. గొల్లపల్లి రామకిషన్ (రాఖీ, ) ఐసీఐసీఐ సౌత్ రీజన్ హెడ్ రిటైర్డ్ అధికారి గుండి విష్ణు ప్రసాద్..డా. శ్రీధర్ మిత్రులు , దుస రాజేశ్వర్, మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు సౌల్ల భీమన్న,. గుండి నరసయ్య,. కస్తూరి నాగయ్య, రామ్ కిషన్ , చంద్రశేఖర్. గాయని మణులు అనుపమ, శ్రీ కుమారి, స్థానికులు, తదితరులు పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా గీతా రచయిత రాఖి నీ పలువురు అభినందనలు, ప్రశంసలతో. తమ తమ ప్రసంగాలలో ముంచెత్తారు. ఈ కార్యక్రమానికి గుండి విష్ణు ప్రసాద్, నిర్వాహకుడిగా,. వ్యాఖ్యతగా. వ్యవహరించారు.