హైదరాబాద్ పద్మాలయ స్టూడియోలో..
( J. Surender Kumar.)
సూపర్ స్టార్ కృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నివాళులర్పించారు. విమానాశ్రయం నుంచి నేరుగా పద్మాలయ స్టూడియోకు చేరుకున్న సీఎం సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయం దగ్గర నివాళులర్పించారు.

కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం, మహేష్ బాబును ఆలింగనం చేసుకుని జగన్ ఓదార్చారు. సీఎం జగన్ వెంట మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్గాని భరత్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

శ్వాసకోశ సంబంధిత వ్యాధితో సినీ హీరో కృష్ణ బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.

టాలీవుడ్ ప్రముఖుడు. హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.