తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రొట్టె శ్రీనివాస్ !

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, తపస్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా (కార్యవర్గ సభ్యునిగా) రాయపట్నం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రొట్టె శ్రీనివాస్ ను ఆ సంఘ నాయకులు నియమించారు.

నియామకానికి సహకరించిన తపస్ రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులకు, జగిత్యాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు, ధర్మపురి మండల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు కా శెట్టి శ్రీనివాస్, దావన్ పెళ్లి రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు బండి మహేష్, జిల్లా కార్యదర్శి కాశెట్టి రమేష్ ఒక ప్రకటనలో వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రొట్టె శ్రీనివాస్ ను సైతం అభినందించారు. ఈ సందర్భంగా రొట్టె శ్రీనివాస్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉపాధ్యాయుల సమస్య ల పరిష్కారానికి, తపస్ సంఘ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.