టీటీడీ ప్రకటించిన శ్వేత పత్రంలో..
( J. Surender Kumar)
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తుల నికర విలువ ₹ 2.26 లక్షల కోట్లు అని శనివారం టీటీడీ శ్వేత పత్రం విడుదల చేసింది.
. శ్రీవారి ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో జరుగుతున్న దుష్ఫ్రచారాన్ని నమ్మవద్దు అని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏ ధర్మారెడ్డి ప్రకటనలో కోరారు. టీటీడీ బోర్డు ఆమోదించిన విధంగానే బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లు వెల్లడించింది. శ్రీవారికి బ్యాంకుల్లో మొత్తంగా ₹ 15,938 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు టీటీడీ ప్రకటించింది. అదే విధంగా 10,258.37 బంగారం ఉన్నట్లు వివరించింది. 24 జాతీయ బ్యాంకుల్లో నగదు నిల్వ చేసినట్లు టీటీడీ ప్రకటించింది. గత మూడేళ్ల కాలంలో శ్రీవారి నగదు..డిపాజిట్లు బాగా పెరిగాయని టీడీపీ వెల్లడిచింది.
బ్యాంకు డిపాజిట్లు 2019, జూన్ 30 నాటికి ₹ 13025.09 కోట్లు ఉండగా, సెప్టెంబర్ 30, 2022 నాటికి అవి ₹ 15938.68 కోట్లకు చేరాయి. అదే విధంగా బంగారం 2019 జూన్ 30 నాటికి 7339.74, కిలోలు ఉండగా సెప్టెంబర్ 30, 2022 కి ఆమొత్తం 10,258.37 కిలోలకు చేరింది. అన్నారు
.అక్టోబర్ మాసంలో 22.74 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా. హుండీ ద్వారా ₹ 122 కోట్ల, 23లక్షలు ఆదాయం లభించింది. కోటి 8 లక్షల లడ్డులను భక్తులకు విక్రయించినట్లు తెలిపారు. 60.లక్షల 91వేల మంది భక్తులు అన్నదానంలో అన్నప్రసాదాని స్వీకరించారని.. 10 లక్షల 25.వేల మంది భక్తులు శ్రీవారికీ తలనీలాలను సమర్పించారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరించారు. దేశంలో 960 ప్రాంతాల్లో 7,123 ఎకరాల భూములు ఉన్నాయని , సబ్ రిజిస్టార్ నిజమైన ప్రసారం 85.705 కోట్లు కాగా మార్కెట్లో వీటి విలువ 2 లక్షల కోట్లకు పైగా ఉంటుందన్నారు. అతిథి గృహాలు, కాటేజీలు, యాత్రికుల సౌకర్యార్థం హాస్పిటల్ విలువ ₹ 5000/ కోట్లు కు పైగా ఉంటుందన్నారు.