(J.Surender Kumar)
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం లో నూతనంగా ఏర్పడిన బీమారం మండలం లో తహశీల్దార్ కార్యాలయాన్ని. సోమవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ….
నూతన బీమారం మండలం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మండలం ఏర్పడింది, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీ మండల ప్రజల తరపున ధన్యవాదాలు మంత్రి తెలిపారు,

ఎనిమిది ఏండ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అద్భుతాలు సృష్టించిన విజనరీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి అన్నారు
అనంతరం మండలంలో దివ్యాంగులకు మంజూరు అయిన బ్యాటరీ ట్రై సైకిళ్లు, మూడు చక్రాల స్కూటీ లను మరియు దళిత బంధు ద్వారా మంజూరు అయిన వ్యాన్ ను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన పల్లి వినోద్ కుమార్ , స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, కలెక్టర్ రవి నాయక్, జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత, హరిచరణ్ రావు, డీసీఎంఎస్ చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి కొప్పుల దంపతులు !

కార్తీక మాసం చివరి సోమవారం, సందర్భంగా సుప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రి కొప్పుల దంపతులకు అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు.

అనంతరం ఆలయ అధికారులు మంత్రికి స్వామి వారి ప్రసాదాలు అందజేశారు
మంత్రి తో పాటు స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు , జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, ఈ.ఓ కృష్ణ ప్రసాద్ తోపాటు పలువురు ఉన్నారు.