టీవీని – ఠీవిగా చూద్దాం!
నేడు వరల్డ్‌ టెలివిజన్‌ డే

(J. Surender Kumar)

ఆధునిక కాలంలో రేడియో, టీవీల ఆవిష్కరణతో సమాచారం త్వరగా ప్రజలకు చేరడం మొదలైంది. బుల్లితెర అని మనం ముద్దుగా పిలుచుకునే టెలివిజన్‌ లేని ప్రపంచాన్ని నేడు ఊహించడం కూడా అసాధ్యమే. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో వింతలు, విశేషాలను మన నట్టింట్లో ఆవిష్కరిస్తుంది టీవీ. మానవాళికి టెలివిజన్‌ అందిస్తున్న సేవలకు గుర్తుగా నవంబర్‌ 21ని ‘వరల్డ్‌ టెలివిజన్‌ డే’ గా జరుపుకుంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వరల్డ్‌ టెలివజన్‌ డే ని నవంబర్‌ 21న జరుపుకోవాలని 1996లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించింది. జూన్ 1924 లో, జాన్ లోగి బెయిర్డ్ సిరిల్ ఫ్రాంక్ ఎల్వెల్ నుండి, థాలియం సల్ఫైడ్ (థాలోఫైడ్) సెల్ ను కొనుగోలు చేశాడు. దీనిని అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని థియోడర్ కేస్ అభివృద్ధి చేసింది. ‘మాట్లాడే చిత్రాలు’ యొక్క ముఖ్యమైన కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో థాలోఫైడ్ సెల్ ఒక భాగం. ఈ సెల్ కు బెయిర్డ్ యొక్క మార్గదర్శక సూత్రాల అమలు మూలంగా, పరావర్తన కాంతి నుండి ప్రత్యక్ష, కదిలే, గ్రేస్కేల్ టెలివిజన్ చిత్రాన్ని రూపొందించిన మొదటి వ్యక్తిగా బెయిర్డ్ గుర్తింపు పొందాడు . కేస్ సెల్‌కు రెండు ప్రత్యేకమైన పద్ధతులను వర్తింపజేయడం ద్వారా ఇతర ఆవిష్కర్తలు విఫలమైనా దానిని బెయిర్డ్ విజయవంతంగా సాధించాడు. సెల్, నుండి సిగ్నల్, కండిషనింగ్‌ను మెరుగుపరచడం ద్వారా, ఉష్ణోగ్రత ఆప్టిమైజేషన్ (శీతలీకరణ), తన స్వంత కస్టమ్ డిజైన్ చేసిన వీడియో యాంప్లిఫైయర్ ద్వారా అతను దీనిని సాధించాడు. బైర్డ్ 25 మార్చి 1925 నుండి మూడు వారాల ప్రదర్శనల సిరీస్‌లో లండన్‌లోని సెల్ఫ్రిడ్జెస్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో టెలివిజన్ ద్వారా కదిలే సిల్హౌట్ చిత్రాలను బహిరంగంగా ప్రదర్శించాడు.


మనదేశంలో మొట్టమొదట 1959, సెప్టెంబర్‌ 15న ఢిల్లీలో టెలివిజన్‌ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1975 వరకూ ఇండియాలోని ఏడు నగరాల ప్రజలు మాత్రమే టీవీని వీక్షించారు. 1980 లోకలర్‌ టీవీలు ప్రవేశించాయి.1990 తర్వాత అనేక ప్రైవేటు చానళ్లు అందుబాటులోకి వచ్చాయి. తర్వాత టెలివిజన్‌ రంగంలో ఎన్నో కొత్త పోకడలు వచ్చాయి. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్‌ రంగం విస్రృత ప్రసారమాధ్యమంగా ఉంది.
ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు చేస్తున్న మంచి పనులతో పాటు, లోటుపాట్లను కూడా నిర్భయంగా ఎత్తి చూపుతున్నాయి. మీడియా పరిధి విస్తృతమవుతున్న కొద్దీ మీడియా రెండు కోణాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. మొదటిది ప్రజల నుంచి అభినందనలు. రెండోది పాలకుల ఆంక్షలు. ఉపయోగాల మాట ఎలా ఉన్న నేడు గ్రామీణ ప్రాంతాలలో కూడా టి వి లలో ప్రసారమవుతున్న కొన్ని పక్షపాత ప్రసారాలు, నైతిక విలువలకు పాతరవేసే సీరియళ్ళు పెద్దలతో బాటు మహిళలు ,యువతలో కూడా పెడ పెడదోరణలు పెట్టే ఆలోచనలు కలిగించేలా ఉండి సామాజీక వేత్తలలో ఆందోళనలు కలుగుతున్నాయి. చానల్లు టి ఆర్ పి రేటింగ్ రేస్ లో పోటీపడటమే ఇటువంటి కార్యక్రమాల ప్రసారానికి కారణం. సాంప్రదాయాలను, నైతిక విలువలను కాపాడవలసిన బాధ్యతను ఆయా టీవీ యాజమాన్యాలు మరిచిపోరాదు. దిన పత్రికల లాగానే నేడు టీవీ ఛానెల్స్ కూడా వివిధ రాజకీయ పార్టీల కు వత్తాసు పలుకుతున్నాయి. టీవీలకు మనం బానిసలుగా మారకూడదు.టీవీని ఠీవిగా చూద్దాం.
(యం.రాం ప్రదీప్, సౌజన్యంతో)
తిరువూరు
9492712836