వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం!


జగిత్యాల ఎమ్మేల్యే ,జెడ్పీ చైర్ పర్సన్


( J. Surender Kumar )
జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో చలిగల్ వ్యవసాయ మార్కెట్ లో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ , జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ ప్రారంభించారు.

అనంతరం చల్ గల్ గ్రామంలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఇద్దరు లబ్ధిదారులకు మంజూరైన ₹50 వేల చెక్కులను లబ్దిదారులకు అందించారు.
ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నక్కల రాధ,.సర్పంచ్ ఎల్ల గంగనర్సు రాజన్న, రైతు బందు సమితి కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, AMC వైస్ చైర్మన్ అసిఫ్,.ఉప సర్పంచ్ పద్మ తిరుపతి, DCO రామాంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ సీఈవో వేణు, డైరెక్టర్లు, అధికారులు, నాయకులు,రైతులు, తదితరులు పాల్గొన్నారు.
బీర్పూర్ మండలంలో ఎమ్మెల్యే సంజయ్ పర్యటన !

బీర్ పూర్ మండల తుంగురు గ్రామ శివాలయం లో గాయత్రి మహా యజ్ఞం కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆయన వెంట బీర్ పూర్ మండల నాయకులు, సర్పంచులు, ఎంపిటిసి లు, ,ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
చెక్కుల పంపిణీ !

బీర్పూర్ మండలానికి చెందిన 21 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ₹5లక్షల 63 వేల 500/- రూపాయల విలువగల చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
పరామర్శ.!

తాళ్లధర్మారం సర్పంచ్ నల్ల మహిపాల్ రెడ్డి ,మామ ఏనుగు మోహన్ రెడ్డి ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని.

ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు.
కొలవాయి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ మల్రాజ్ రవీందర్ రావు తల్లి కౌసల్య ఇటీవల అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరామర్శించి ఓదార్చారు.