ధర్మపురి నరసింహా ఆలయంలో..
( J. Surender Kumar )
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం తులసి కళ్యాణం అంగరంగ వైభవనం జరిగింది.
పంచ పర్వములలో భాగంగా ” వైకుంఠ చతుర్ధశి” పర్వదిన గోధూళి సుముహూర్తములో శ్రీ శేషప్ప కళావేదికపై విధివిధానవేదోక్త సనాతన సాంప్రదాయ పద్ధతిలో శ్రీ స్వామివారల, తులసి కళ్యాణం వైభవంగా జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , రెనవేషన్ కమిటి సభ్యులు, ఇందారపు రామయ్య, గునిశెట్టి రవీందర్, చుక్క రవి, వేముల నరేష్, ఇనగంటి రమ వెంకటేశ్వరరావు, సంగెం సురేష్ , అక్కనపల్లి సురేందర్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, ముత్యాల శర్మ, ఉపప్రదాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసా చార్యులు, అర్చకులు మోహనా చార్యులు , బొజ్జ సంపత్ కుమార్, రాజగోపాల్, కల్వకుంట్ల మధుసూదనాచారి, మరియు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా గోదావరి హారతి !

శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయం నుండి మేళతాళాలతో గోదావరి నదివరకు వచ్చి విశేష పూజల అనంతరం గోదావరి నదిలొ వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి గోదారి హారతి కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తజనం పాల్గొన్నారు.