అబ్జర్వర్ లను ఏర్పాటు చేసిన హైకోర్టు ,!
క్యూలైన్లలో లక్షలాదిమంది అయ్యప్పలు!
(J. Surender Kumar)
శబరిమల ఆలయంలో రద్దీని నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించడానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన చాంబర్లో సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
గంటల తరబడి అయ్యప్ప స్వాములు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉండడం, రద్దీ ,తొక్కిసలాట అయ్యప్ప భక్తులకు ఇబ్బందులు, తదితర అంశాలపై కేరళ హైకోర్టు ప్రత్యేక విచారణ చేపట్టింది.

శనివారం అయ్యప్ప ఆలయ సన్నిధాన. సముదాయం నుండి 1 కిమీ దూరంలో ఉన్న మరకూటంలో జరిగిన తోక్కిసలాట లో కొంతమంది యాత్రికులు, పోలీసులు గాయపడిన, సంఘటన సెలవు దినం ఆదివారం కూడా హైకోర్టు స్పందించింది.. రద్దీని నియంత్రించేందుకు ఎలాంటి కార్యాచరణ ప్రణాళికలు చేపట్టారు. . క్రౌడ్ కంట్రోల్ సిస్టం ఎలా అమలు చేస్తున్నారు ,అంటూ ఆలయ బోర్డును, పట్నంతిట్ట జిల్లా కలెక్టర్‌ను నివేదికలను అందించాల్సిందగా హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాల తర్వాత, ఆలయ బోర్డు శబరిమల “దర్శనం” సమయాన్ని మరో గంటకు పొడిగించింది. మరియు వర్చువల్ క్యూ బుకింగ్‌ను రోజుకు 80,000 మంది యాత్రికులకు పరిమితం చేయాలని నిర్ణయించింది.
శబరిమల ఆలయంలో రద్దీ నిర్వహణకు సంబంధించి కేరళ హైకోర్టు ఆదివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించి భక్తుల సౌకర్యాల కల్పన చర్యలకు శ్రీకారం చుట్టింది.
శబరిమల భక్తుల కోసం హైకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటుచేసి నిరంతరం పుణ్యక్షేత్రంలో జరిగే పరిణామాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంది.

శనివారం 1.20 లక్షల మంది యాత్రికులు ఆలయానికి వెళ్లారని, రద్దీ దృష్ట్యా పోలీసులు స్పాట్ బుకింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చిందని ఆలయ అధికారి తెలిపారు. “గత కొన్ని రోజులుగా పుణ్యక్షేత్రంలో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది” అని అధికారి తెలిపారు. గుడిలోకి వెళ్లే 18 పవిత్ర మెట్లకు చేరుకోవడానికి 10 గంటలకు పైగా క్యూలో నిలబడాల్సి వచ్చిందని కొందరు యాత్రికులు తెలిపారు.

రద్దీ రోజుల్లో రాత్రి 11.30 గంటల వరకు దర్శనం
.ఇదిలావుండగా, ఆలయంలో దర్శనం సాఫీగా జరిగేలా క్రౌడ్ మేనేజ్‌మెంట్ , వాహనాల రాకపోకల నియంత్రణకు సంబంధించి కేరళ హైకోర్టు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మరియు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రద్దీ రోజుల్లో భక్తుల పూజల సమయాన్ని గంటపాటు పొడిగించాలని హైకోర్టు ప్రతిపాదించింది. అయ్యప్పల రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం 3 గంటల నుండి రాత్రి 11.30 గంటల వరకు దర్శనానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు.
శబరిమలకు వెళ్లే మార్గాల్లో వాహనాల రాకపోకల నిర్వహణకు సంబంధించి, వాహనాల రాకపోకలకు ఎక్కువ సమయం అడ్డుగా ఉన్నప్పుడు మోటార్‌సైకిళ్లపై పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని జిల్లా పోలీసు చీఫ్‌ను కోర్టు ఆదేశించింది.
ఎస్పీ బదిలీ!
అయ్యప్ప సన్నిధానంలో విధులు నిర్వహిస్తున్న ఎస్పి హరిచంద్ర నాయక్ ను పంపా సెక్టర్ కు బదిలీ చేశారు.. క్రౌడ్ కంట్రోల్ ( రద్దీ నియంత్రణలో) విఫలమైనట్టుగా భావించిన పోలీస్ ఉన్నతాధికారులు చర్యలకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. పంపానది సెక్టార్ లో.విధులు నిర్వహిస్తున్న సుదర్శన్ ను సన్నిధానంకు బదిలీ బదిలీ చేశారు. దేవస్థానం బోర్డు, పోలీసులు, దేవాదాయశాఖ సిబ్బంది, అయ్యప్ప భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విధి నిర్వహణ తీరును. ప్రతిక్షణం పర్యవేక్షణ, హైకోర్టు అయ్యప్పల రద్దీ ప్రాంతాల్లో అబ్జర్వర్లను నియమించింది.