ఎమ్మెల్యే సంజయ్ కుమార్ !
(J.Surender Kumar)
జగిత్యాల పట్టణ అర్బన్ హౌసింగ్ కాలని కెసిఆర్ నగర్ లో
4520 డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లో ₹ 9 కోట్ల 6 లక్షల తో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు బుధవారం జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ 4520 డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణనికి ₹ 340 కోట్ల నిధులతో ₹ 225 కోట్ల పనులు పూర్తి అయ్యాయి అని అన్నారు.

సీఎం తన నిధుల నుండి ₹10 కోట్ల మంజూరుకు హామీ ఇచ్చారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డి చొరవతో ₹ 25 కోట్ల నిధులు మంజూరు కానున్నాయి .
మొత్తం ₹ 45 కోట్లు ఇటీవల కాలంలో మంజూరు అయ్యాయి. అన్నారు
దేశం మొత్తంలో ఇంత పెద్ద మొత్తం లో డబల్ బెడ్ రూమ్ ప్రాజెక్ట్ ఎక్కడా లేదు అని వివరిస్తూ
డబల్ ఇండ్ల మంజూరు లో 12 శాతం ముస్లిం లకు ..15 శాతం దళితులకు,7 శాతం ఎస్టీ లకు మరియు
E.B. C O C లకు మిగతా శాతం కేటాయించనున్నట్టు అన్నారు….
360 యాప్ ద్వారా నిజమైన అర్హుల జాబితాను గుర్తిస్తారు ..
ఎలాంటి పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా ఇండ్ల మంజూరు. మధ్యవర్తుల నమ్మి మోసపోవద్దు అని కలెక్టర్ అధ్యక్షతన మంజూరు జరుగుతుంది అని ఇప్పటికే సర్వే పూర్తి అయ్యింది అని అన్నారు.
ధరఖాస్తు చేసుకోలేని వారు దరఖాస్తు చేయాలని కోరారు.

జగిత్యాల కు ఇప్పటి వరకు ₹ 700 కోట్ల పైగా నిధులు మంజూరు అయ్యాయి అని అన్నారు
ఎమ్మెల్సీ కవిత సహకారం తో నేడు 4520 ఇండ్ల మంజూరు, ఈ సందర్భంగా కవిత కు ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు…
మానవ వ్యర్థాల కోసం ₹ 2 కోట్ల తో FSTP ఏర్పాటు. చేయనున్నట్టు తెలిపారు.
డబల్ బెడ్ రూం నిర్మాణం పూర్తి చేయటమే కాదు మౌలిక సదుపాయాల కల్పన చేస్తామని అన్నారు .ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మెన్ డా.చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్,.కమిషనర్ డా. నరేష్,.EE లు రహమాన్, శేకర్ రెడ్డి, DE లు రాజేశ్వర్, మిలింధ్, జలంధర్ రెడ్డి, DSP ప్రకాష్, కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు

అనంతరం గుట్ట పై నుండి అర్బన్ హౌసింగ్ కాలని కెసిఆర్ నగర్ ను వీక్షించారు ఎమ్మెల్యే వెంట పట్టణ, బి అర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
