7న జగిత్యాల కు సీఎం కేసిఆర్ రాక !

ఉదయమే సిఎం రాక!

మెడికల్ కళాశాల భవనానికి భూమిపూజ,!

తెరాస భవన్, కలెక్టరేట్ సమీకృత భవన సముదాయం ప్రారంభం!

మంత్రి తన్నీరు హరీష్ రావు!

(J. Surender Kumar)

ఈనెల 7న జగిత్యాల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గురువారం తెలిపారు.

ముఖ్యమంత్రి జగిత్యాల పర్యటన దృష్ట్యా IDOC లో ఏర్పాట్లను మంత్రులు తన్నీరు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, MLC శ్రీమతి కవిత, ఎల్. రమణ, స్థానిక శాసన సభ్యులు డా. సంజయ్ కుమార్ లు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా కలెక్టర్ జి రవి, ఎస్పీ సింధు శర్మ లతో కలిసి పరిశీలించారు.
అనంతరం మోతె లో బహిరంగ సభ స్థలాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.


సభ సజావుగా జరిగేందుకు వీలుగా ప్రజా ప్రతినిధులు, అధికారులు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ..

ఉదయం జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారని చెప్పారు, అనంతరం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భవనానికి ప్రారంభోత్సవం చేస్తారని మంత్రి పేర్కొన్నారు.
ఆ తర్వాత ప్రజా నిధులు అధికారులతో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారని స్పష్టం చేశారు.

మధ్యాహ్నం 02.00 గంటల నుంచి సాయంత్రం 04.30 గంటల వరకు వరకు మోతే లో జరగనున్న బహిరంగ సభ లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.
బహిరంగ సభకు జగిత్యాల జిల్లా నుంచే కాక కరీంనగర్ జిల్లాలోని కొంత భాగం, ఆర్మూర్, బాల్కొండ నియోజవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనున్నట్లు తెలిపారు.

సిఎం కేసిఆర్ వల్లే జిల్లా, మెడికల్ కళాశాల

తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సహకారం కావడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు బాధ్యతలను చేపట్టడం వల్లే జగిత్యాల ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం జగిత్యాల జిల్లాను సాకారం చేసుకున్నామని మంత్రి తెలిపారు., అలాగే జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ స్వ రాష్ట్రం ఏర్పడకుండా, ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేవా అని అన్నారు.