అబిద్ మరణం పత్రికా రంగానికి తీరని లోటు!

జిల్లా. అధ్యక్షుడు శ్రీనివాసరావు !

27 సంవత్సరాల పత్రికా రంగ ప్రస్థానంలో సహారా ఉర్దూ జర్నలిస్టు అబిద్ మరణం పత్రికా రంగానికి తీరని లోటని, ఒకమంచి మిత్రుడిని కోల్పోయామని టియు డబ్ల్యూ జే ఐజేయు జగిత్యాల జిల్లా అధ్యక్షులు, జగిత్యాల ప్రెస్ క్లబ్ అద్యక్షులు చీటి శ్రీనివాసరావు అన్నారు.

శుక్రవారం సాయంత్రం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో దివంగత జర్నలిస్ట్ అబిద్ కు ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు క్రొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు తోపాటు పలువురు మాట్లాడుతూ, గత 20 ఏండ్లుగా ఉర్దూ పత్రికా రంగంలో అబిద్ సేవలు అభినందనీయం అన్నారు. ఉర్దూ రిపోర్టర్లలో పేరెన్నికగన్న అబిద్ అన్ని విషయాలలో చురుకైన పాత్ర పోశించే వారన్నారు. పత్రికా సమావేశాల్లో నాయకులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసి జవాబు రాబట్టే వాడని కొనియాడారు. భౌతికంగా అబిద్ లేకున్నా పత్రికా రంగం వున్నంతకాలం అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాడని శ్రీనివాసరావు, పలువురు వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు ఉన్నారు.