(J.Surender Kumar)
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్ష,కార్యదర్శులుగా డాక్టర్ జానారెడ్డి,సిహెచ్ ఝాన్సీలు శుక్రవారం ఎంపికయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఏబీవీపీ 41 వ రాష్ట్ర మహాసభల్లో రాబోయే సంవత్సరానికి రాష్ట్ర సారధులను ఎంపిక చేశారు.ఎన్నికల అధికారిగా ప్రమోద్ వ్యవహరించగా అధ్యక్ష కార్యదర్శుల ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

అధ్యక్షుడుగా ఎన్నికైన డాక్టర్ జానారెడ్డి 1999 నుండి ఏబీవీపీలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పటాన్చెరువు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన చింతకాయల ఝాన్సీ ది నల్లగొండ జిల్లా అనుముల మండలం అంబటిపల్లి గ్రామం. ఏబీవీపీలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా కొనసాగుతున్నారు .ఝాన్సీ ప్రస్తుతం మహాత్మా గాంధీ న్యాయ కళాశాలలో ఎల్.ఎల్.బి ఫైనల్ ఇయర్ చదువుతోంది.